తులసి – మనీ ప్లాంట్ కలిసి పెంచవచ్చా? వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసా?

23rd March 2026

White Scribbled Underline

ప్రతి ఇంటి ముందు తులసి మొక్క కనిపించడం సహజం. అలాగే ఇంటి లోపల మనీ ప్లాంట్ పెంచుకోవడం కూడా చాలా మందికి అలవాటైంది. అయితే ఈ రెండు మొక్కలను ఒకే దగ్గర ఉంచవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది.

తులసి మొక్కను పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. ఇది ఇంట్లో శుభ వాతావరణాన్ని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు.

మనీ ప్లాంట్ కూడా ఇంట్లో ఉంచితే అదృష్టం వస్తుందని నమ్మకం ఉంది. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని, ప్రతికూల శక్తులను తగ్గిస్తుందని విశ్వాసం.

ఈ రెండు మొక్కలు కూడా సానుకూల శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని ఇంట్లో ఉంచడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

తులసి, మనీ ప్లాంట్‌ను ఒకే ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతాయని అంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం కూడా పెరుగుతుంది.

ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తగ్గి, సంపద పెరిగే అవకాశాలు ఉంటాయని విశ్వాసం ఉంది. అందుకే ఈ రెండు మొక్కలను కలిసి పెంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు.

ఇంటికి అందం ,అదృష్టం తెచ్చే మొక్కలు ఇవే..