Floral Pattern
Floral Pattern

వర్షాలు చల్లదనంతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా వెంట తెస్తాయి. జలుబు, దగ్గు, అజీర్ణం వంటి ఇబ్బందులు ఈ కాలంలో ఎక్కువగా వస్తాయి

Floral Pattern
Floral Pattern

మనం తీసుకునే ఆహారం చాలా కీలకం. వర్షాకాలంలో మన ఇమ్యూనిటీని (Immunity) బలంగా ఉంచడంలో నల్ల మిరియాలు (Black Pepper) ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఇమ్యూనిటీ పెంచే మిరియాలు: నల్ల మిరియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి శరీర రక్షణ శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్‌ నుంచి దూరంగా ఉండడానికి ఇవి సహజ రక్షకులుగా పనిచేస్తాయి.

Floral Pattern
Floral Pattern

శ్వాసకోశ సమస్యలకు చెక్: జలుబు, ముక్కు దిబ్బడ, కఫం లాంటి సమస్యలకి మిరియాలు మంచి పరిష్కారం. వీటిలోని పైపెరిన్ అనే పదార్థం ముక్కు దిబ్బడను తగ్గించి శ్వాసను సులభం చేస్తుంది.

Floral Pattern
Floral Pattern

జీర్ణక్రియకు మేలు నల్ల మిరియాలు కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ (Hydrochloric Acid) ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.

Floral Pattern
Floral Pattern

ఉపయోగించే పద్ధతి: పాలు, సూప్స్, సలాడ్స్ లేదా టీలో కొద్దిగా మిరియాల పొడి వేసి తీసుకుంటే చాలు – రుచి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ వర్షాకాలంలో నల్ల మిరియాలు మీ డైట్‌లో చేర్చండి హెల్తీగా ఉండండి..