ఇప్పటి వేగవంతమైన జీవితంలో చాలామంది పడుకున్న వెంటనే నిద్రపట్టడం కష్టంగా మారింది. రోజంతా ఫోన్స్ (మొబైల్ ఫోన్స్) , కంప్యూటర్స్, టీవీల (TVs) స్క్రీన్స్ చూస్తూ గడపడం వల్ల కళ్ళు డ్రైగా, ఎర్రగా మారుతాయి. ఈ అలసట కారణంగా చాలామంది నిద్రలేమితో (Insomnia) బాధపడుతున్నారు.
Art Critic, Gagosian Gallery
పాతకాలపు మంచి అలవాటు మునుపటి తరాలు నిద్రకు ముందు కళ్ళు చల్లని నీటితో కడుక్కోవడం అలవాటు చేసుకునేవారు. ఆయుర్వేదం ప్రకారం ఈ పద్ధతి నేడు కూడా ఎంతో ప్రయోజనకరం. ఇది కంటి ఒత్తిడి తగ్గించడమే కాకుండా, కళ్ళలో చల్లదనాన్ని కలిగిస్తుంది.
కంటి స్ట్రెయిన్‌కి ఉపశమనం రోజంతా స్క్రీన్ చూడడం వల్ల కంటి నరాలు బిగుసుకుపోతాయి. నిద్రకు ముందు చల్లని నీటితో కళ్ళు కడిగితే ఆ స్ట్రెయిన్ తగ్గుతుంది. దీని వల్ల కళ్ళు తేలికగా, హాయిగా మారుతాయి.
ఆప్టిక్ నాడుల ప్రాధాన్యం మన కంటిలో ఉన్న ఆప్టిక్ నాడీ (Optic Nerve) మెదడుతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ నరాలు సరిగ్గా పనిచేయాలంటే కంటి ఒత్తిడి తక్కువగా ఉండాలి. కళ్ళు కడగడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల ఈ నాడులు రిలాక్స్ అవుతాయి.
పిత్త దోషం నియంత్రణ ఆయుర్వేదం ప్రకారం కళ్ళు చల్లని నీటితో కడగడం ద్వారా శరీరంలోని పిత్తదోషం నియంత్రితమవుతుంది. దీని వల్ల శరీర వేడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మానసిక ప్రశాంతత కళ్ళు కడిగితే మనోవాహ స్రోతాస్ రిలాక్స్ అవుతుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గి మనసు సాంత్వన చెందుతుంది. ఈ చిన్న అలవాటు పాటిస్తే రాత్రిళ్లు హాయిగా, మంచి నిద్ర పొందవచ్చు.