మైక్రో గ్రీన్స్ అంటే చిన్న దశలోనే కోయబడే ఆకుకూరలు, ఇవి తక్కువ పరిమాణంలో ఎక్కువ పోషకాలు అందించి శరీరానికి శక్తిని ఇస్తాయి.
వీటిని తినడం వల్ల విటమిన్లు, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోకి చేరి ఇమ్యూనిటీ పెరగడానికి సహాయపడతాయి.
మైక్రో గ్రీన్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, కడుపు సమస్యలు తగ్గించి గట్ హెల్త్‌ను బలోపేతం చేస్తాయి.
రోజూ ఆహారంలో మైక్రో గ్రీన్స్ చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి ఉపయోగపడతాయి.
డయాబెటిస్ ,బరువు నియంత్రణలో మైక్రో గ్రీన్స్ మంచి ఎంపిక, తక్కువ కేలరీలతో ఎక్కువ పోషణ అందిస్తాయి.
సలాడ్లు, సాండ్విచ్లు లేదా అన్నంలో మైక్రో గ్రీన్స్ వేసుకుని తింటే శరీరం ఆరోగ్యంగా ఉండి రోజంతా తాజాదనాన్ని ఇస్తాయి.