ఉదయం గోరువెచ్చని నీటితో కొద్దిగా నెయ్యి తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరచి శరీరానికి మంచి శక్తిని అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

నెయ్యి పేగులను మృదువుగా ఉంచి మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేయడంలో సహాయపడుతుంది.

ఈ అలవాటు శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడంలో దోహదపడుతూ సహజ డిటాక్స్‌లా పనిచేస్తుందని అంటున్నారు.

రోజూ పరిమితంగా నెయ్యి తీసుకోవడం వల్ల మెటబాలిజం మెరుగై అలసట తగ్గి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

మహిళలకు పీరియడ్స్ సమయంలో నెయ్యి చాలా ఉపయోగకరమని చెబుతున్నారు, ఇది హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడి కడుపు నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది.

అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్, బలహీనత తగ్గించడం తో పాటు హార్మోన్ల సమతుల్యతకు దోహద పడుతుంది.