మనకు తీపి రుచి ఇచ్చే చక్కెర మన ఆరోగ్యానికి చేదు ఫలితాలు ఇస్తుంది. చాలామంది తీపి తినకుండా ఉండలేరు. కానీ డాక్టర్లు, పోషకాహార నిపుణులు చెబుతున్నట్లుగా ఇది శరీరానికి నెమ్మదిగా హాని చేస్తుంది.

పంచదార దుష్ప్రభావాలు: చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. చర్మం, జుట్టు సమస్యలు కూడా వస్తాయి. దీర్ఘకాలంలో ఇది షుగర్ వ్యాధి (Diabetes), హార్మోన్ అసమతుల్యత (Hormonal Imbalance) వంటి సమస్యలకు దారి తీస్తుంది.

పంచదార తగ్గిస్తే కలిగే లాభాలు: షుగర్‌ని మానేస్తే శరీరంలో డీటాక్సిఫికేషన్  జరుగుతుంది. అంటే, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. 

షుగర్ మానడం వల్ల బరువు తగ్గడం సులభమవుతుంది. ఫ్యాట్ తగ్గడంతో పాటు PCOD, ఫెర్టిలిటీ సమస్యలు తగ్గుతాయి. ఎగ్, స్పెర్మ్ క్వాలిటీ కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా మీ షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి.

పంచదారకి అలవాటు పడ్డవారు ఒక్కసారిగా మానేయకూడదు. రోజువారీ తీసుకునే మోతాదును క్రమంగా తగ్గించాలి. ఉదాహరణకు, రెండు స్పూన్లు తీసుకునేవారు ఒక స్పూన్‌గా, ఒక స్పూన్ తీసుకునేవారు అర స్పూన్‌గా మార్చాలి. ఇలా ఏడు రోజులపాటు కొనసాగిస్తే బాడీకి అలవాటు పడుతుంది.