మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచిబాబు సానాతో పెద్ది సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
పెద్ది సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని బుచ్చి ప్లాన్ చేస్తున్నాడు.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ తుది దశకు చేరుకుంది.
అయితే పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉన్నట్టు సమాచారం.
ఈ స్పెషల్ సాంగ్ కోసం ఒక ఫ్రెష్ ఫేస్ ను తీసుకోవాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు.
అందులో భాగంగానే బుచ్చి మానస వారణాసిని సంప్రదించినట్టు తెలుస్తుంది.
రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి మెప్పించింది మానస.
చరణ్ లాంటి స్టార్ హీరోతో కలిసి స్పెషల్ సాంగ్ చేయడమంటే అరుదుగా వచ్చే అవకాశం కాబట్టి మానస దీన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.