ప్రకృతి మనకు అందించిన అనేక ఔషధ పండ్లలో ఉసిరికాయ (Indian Gooseberry) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇది విటమిన్ Cతో నిండిన సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్ C: ఒక చిన్న ఉసిరికాయలో ఉండే విటమిన్ C, ఒక నారింజ (Orange) పండుతో పోలిస్తే దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది.విటమిన్ c చలికాలంలో శరీర రక్షణ శక్తిని పెంచి, వైరస్లు మరియు బ్యాక్టీరియా దాడుల నుంచి కాపాడుతుంది. అందుకే విటమిన్ సి పవర్ హౌస్ ఉసిరికాయను ఈ సీజన్లో తీసుకోవడం చాలా మంచిది.
డయాబెటిస్ కంట్రోల్: మధుమేహం ఉన్నవారికి ఉసిరికాయ ఎంతో ప్రయోజనకరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి శరీరానికి అవసరమైన సమతుల్యాన్ని కల్పిస్తుంది. అందువల్ల మధుమేహ రోగులు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.
జలుబు, దగ్గు: శీతాకాలంలో ప్రతిరోజు ఉసిరికాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. ఉసిరిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
హార్ట్ హెల్త్: ఉసిరికాయ రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి హార్ట్ అటాక్ (Heart Attack) ముప్పును తగ్గిస్తుంది.
ఉసిరి ప్రాముఖ్యత: ఉసిరికాయను నిత్య ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. చలికాలంలో ఉసిరిని నియమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అపారమైన లాభాలను ఇస్తుంది.
నేరుగా ఉసిరికాయని తినలేని వాళ్ళు దీన్ని జ్యూస్ లేదా స్మూతిలో కలిపి తీసుకోవచ్చు. డైలీ ఆమ్లా షాట్స్ తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది.