యాలకులు చిన్నగా కనిపించినా ఆరోగ్యానికి పెద్ద ప్రయోజనాలు అందించే మసాలాగా గుర్తింపు పొందాయి.
రోజూ ఆహారంలో కొద్దిగా యాలకులు వాడితే జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్, అజీర్న్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
యాలకుల్లో ఉన్న సహజ గుణాలు నోటి దుర్వాసనను తగ్గించి పళ్ళు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
రోజు యాలకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి.
యాలకులు శరీరంలో వాపును తగ్గించడంలో, శ్వాసకోశ సమస్యలను కొంతవరకు ఉపశమింపజేయడంలో ఉపయోగపడవచ్చు.
రోజు పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో ఒక యాలకును తినడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి చర్మంపై మొటిమలు, మచ్చలు వంటి కొన్ని స్కిన్ సమస్యలు క్రమంగా తగ్గుతాయి.