అలోవెరా చర్మానికి సహజమైన ఔషధంలా పనిచేస్తుంది, ఇందులో ఉన్న విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోతుగా పోషించి సహజ కాంతిని తీసుకువస్తాయి.
ముఖంపై అలోవెరా జెల్ వాడితే పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది, చర్మం మృదువుగా మారి రఫ్‌నెస్ తగ్గుతుంది.
మొటిమలు ,మచ్చల సమస్య ఉన్నవారికి అలోవెరా చాలా ఉపయోగకరం, ఇది బ్యాక్టీరియాను తగ్గించి వాపును నియంత్రిస్తుంది.
ఎండ వల్ల వచ్చిన ట్యాన్ లేదా కాలిన చర్మానికి అలోవెరా చల్లదనం ఇస్తుంది, కాలిన మంటను తగ్గించి త్వరగా మానేందుకు సహాయపడుతుంది.
వయస్సు పెరిగేకొద్దీ వచ్చే ముడతలు తగ్గించడంలో అలోవెరా సహకరిస్తుంది, చర్మం బిగుతుగా ఉండేందుకు ఇది సహజంగా పనిచేస్తుంది.
ఎండాకాలం అలోవెరా జల్ ను ఫ్రూట్ జూసెస్ లేదా మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
రోజూ అలోవెరా జెల్‌ను ముఖానికి లేదా శరీరానికి వాడితే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే దీనికోసం మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన జల్ కంటే కూడా ఇంటి వద్ద ఫ్రెష్‌గా పెంచుకొని ఉపయోగించుకోవడం మంచిది.