వాము (Ajwain) కేవలం వంటకాల్లోనే కాకుండా ఆరోగ్య పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఆకులు అనేక రకాల ఔషధ గుణాలతో శరీరానికి సహజ రక్షణగా నిలుస్తాయి.

రక్తహీనతకు సహజ పరిష్కారం: వాము ఆకులు (Ajwain Leaves) లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని పెంచి రక్తహీనత (Anemia) సమస్యను తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా వీటిని ఆహారంలో చేర్చడం వల్ల బాడీకి అవసరమైన ఐరన్ సరఫరా అవుతుంది.

టాక్సిన్స్‌ను దూరం చేసే శక్తి : వాము ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ (Antioxidants) శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. ఈ ఆకులని తేనె (Honey), వెనిగర్ (Vinegar) తో కలిపి తింటే కిడ్నీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. 

నోటి ఆరోగ్యానికి రక్షణ: వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial) లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించి నోటి దుర్వాసన, కావిటీస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ప్రతిరోజు ఉదయం ఒకటి రెండు ఆకులు నమిలితే నోటి శుభ్రత మెరుగుపడుతుంది.

పీరియడ్స్ నొప్పికి ఉపశమనం: మహిళలకు పీరియడ్స్ టైమ్‌లో వచ్చే కడుపు నొప్పి, అలసట తగ్గించడంలో వాము ఆకులు ఉపయోగపడతాయి. వీటిని వేడి నీటిలో మరిగించి తీసుకుంటే కడుపు మంట, నొప్పి తగ్గుతుంది.

జీర్ణ సమస్యలకు సహజ ఔషధం: వాము ఆకులు యాంటీ యాసిడ్ (Anti-acidic) గుణాలు కలిగినవి. ఇవి గ్యాస్, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఆహారం జీర్ణం కావడంలో సాయపడతాయి.

బరువు తగ్గించడంలో సహాయం: ఈ ఆకుల్లో ఫైబర్ (Fiber) ,తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని నమిలి తినడం వల్ల ఆకలి తగ్గి, కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

మొత్తం మీద, వాము ఆకులు శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. వాటిని మన డైట్‌లో చేర్చడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.