జీవనశైలి మార్పులతో మహిళలతో పాటు పురుషుల్లో కూడా సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయి. ఇది చాలా కుటుంబాల్లో ఆందోళనకు కారణమవుతోంది.
బిజీ లైఫ్, సరైన ఆహార అలవాట్లు లేకపోవడం, వ్యాయామం కొరత వంటి కారణాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. డయాబెటిస్, ఊబకాయం, కొలెస్ట్రాల్‌తో పాటు ఫెర్టిలిటీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
చాలా మంది పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్‌తో బాధపడుతున్నారు. సంఖ్యతో పాటు శుక్రకణాల నాణ్యత కూడా తగ్గడం వల్ల గర్భధారణలో సమస్యలు వస్తున్నాయి.
శుక్రకణాల సంఖ్య, నాణ్యత మెరుగుపడాలి అంటే మనం తీసుకునే ఆహారం లో తేలికపాటి మార్పులు చేసుకుంటే మంచిది.
వెల్లుల్లి 5 నుంచి 6 రెబ్బలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు చాలు. ఇవి సులభంగా అందుబాటులో ఉండే పదార్థాలే.
నెయ్యిలో వెల్లుల్లి రెబ్బలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత వాటిని మెత్తగా చూర్ణం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తాజాగా తయారు చేసి 15 రోజుల పాటు తీసుకుంటే శుక్రకణాల సంఖ్యతో పాటు నాణ్యత కూడా మెరుగవుతుంది.