మన వంటల్లో సాధారణంగా వాడే వాము, దాని ఆకులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో వీటి వినియోగం మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాము ఆకుల్లో యాంటీ ఫంగల్ , యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి చలికాలంలో వచ్చే జలుబు , గొంతు నొప్పి , మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
వామాకుల రసం సహజమైనదే కాక, ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. రెగ్యులర్గా చలికాలంలో ఈ రసం తీసుకోవడం వల్ల శ్వాస కోసం సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
వాము ఆకుల , కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, నల్ల మిరియాలు, ఎండు మిర్చి, టమాటాలు, చింతపండు పేస్ట్ వంటి పదార్థాలు ఈ రసం తయారీలో ఉపయోగిస్తారు. ఇవన్నీ మన ఇంట్లోనే దొరికే సాధారణ పదార్థాలే.
పాన్‌లో నూనె వేసి మసాలాలను స్వల్పంగా వేయించాలి. చల్లారిన తర్వాత వీటికి వామాకులు, టమాటాలు జోడించి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. అవసరమైనంత నీరు జోడించి రసం సిద్ధం చేసుకోవచ్చు. దీని రైస్ తో వేడిగా తింటే చాలా టేస్టీ గా ఉంటుంది.