ప్రతి తరానికి ప్రత్యేక దృక్పథం .. కాలం తీర్చిదిద్దిన మనుషుల మనస్తత్వం..

మనిషి ఆలోచనలు, ప్రవర్తన కాలానుగుణంగా మారుతాయి. వీటిని “తరం (Generation)” గా వర్గీకరిస్తారు. ప్రతి తరం తన కాలం, అనుభవాలు, సాంకేతికత ప్రకారం ప్రత్యేక దృక్పథం కలిగి ఉంటుంది. తరం గురించి తెలుసుకోవడం ద్వారా వారి జీవనశైలి, కమ్యునికేషన్, విలువలను అర్థం చేసుకోవచ్చు.

సమాజ శాస్త్రవేత్తలు కాల ఆధారంగా ఆరు తరాలను గుర్తించారు. ప్రస్తుతం ఆల్ఫా జనరేషన్ (Alpha Generation) కొనసాగుతోంది. దీనికి ముందున్న సాంప్రదాయవాదులు, బేబీ బూమర్స్, జనరేషన్ ఎక్స్, మిలీనియల్స్, జనరేషన్ జెడ్ — తమ ప్రత్యేక విలువలతో గుర్తింపు పొందారు.

1925–1945లో జన్మించినవారు సాంప్రదాయవాదులు — శాంతి, క్రమశిక్షణ, విలువలకు ప్రాధాన్యం ఇస్తారు. 1946–1964లో జన్మించినవారు బేబీ బూమర్స్ — ఆర్థిక అభివృద్ధి కాలంలో పెరిగి, కష్టపడి పని, వృత్తి విధేయత, కుటుంబ విలువలను ప్రధానంగా చూస్తారు.

1981–1996లో జన్మించిన మిలీనియల్స్ — సాంకేతికతను త్వరగా స్వీకరిస్తారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ అభివృద్ధి వీరి కాలంలో ఎక్కువగా జరిగింది. వ్యక్తిగత సంతృప్తి, సమానత్వం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తారు.

1997 తర్వాత జన్మించిన జనరేషన్ జెడ్ — పూర్తిగా డిజిటల్ యుగంలో పెరిగిన తరం. స్మార్ట్‌ఫోన్లు, AI వంటి సాంకేతికతలో నైపుణ్యం, ఆధునిక ఆలోచనలు, పర్యావరణం–సమాజంపై చింతన, సృజనాత్మకత మరియు స్వేచ్ఛ వీరి ప్రధాన లక్షణాలు.

మిలీనియల్స్, జెన్ జెడ్‌లు సాంకేతికతకు మమకారం, బూమర్స్, జెన్ ఎక్స్ సంప్రదాయాలను ఇష్టపడతారు. ప్రతి తరం ప్రత్యేక విలువలతో సమాజ అభివృద్ధికి సహకరిస్తుంది, తదుపరి తరానికి దారినిర్దేశం చేస్తుంది.