ప్రస్తుతం చాలా మందికి లేట్‌గా డిన్నర్ చేయడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. లైఫ్ స్టైల్, ఆఫీస్ షెడ్యూల్స్, ట్రాఫిక్, స్నేహితులతో కలసి గడపడం వంటి కారణాలతో రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేయడం తప్పదు. అయితే ఇది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు (Doctors) హెచ్చరిస్తున్నారు.
రాత్రి పడుకునే సమయానికి ముందు భోజనం చేయకపోతే, జీర్ణక్రియ సరిగా జరగక అనేక సమస్యలు వస్తాయి.
డిన్నర్ తిన్న వెంటనే పడుకోవడం జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. అసిడిటీ, గ్యాస్, బరువు, నిద్రలేమి, హృద్రోగాల ప్రమాదం పెరుగుతుంది.
పడుకునే ముందు 2 గంటలకే డిన్నర్ చేయండి . రాత్రి 7లోపే తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేలికైన ఆహారం తీసుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి.
డిన్నర్ టైమింగ్‌ను క్రమంగా మార్చండి. పోషకాహారం తీసుకోండి, రాత్రి ఆకలి తగ్గుతుంది. డిన్నర్ తర్వాత స్క్రీన్‌లకు దూరంగా ఉండండి
ఆరోగ్యకర జీవితం కోసం డిన్నర్ టైమింగ్కి శ్రద్ధ వహించండి. తేలికైన, రుచికర ఆహారం తీసుకోండి. శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వండి.