ఒక్క సీతాఫలం..శరీరానికి సహజ శక్తి సూత్రం..

సీతాఫలం తీపిగానే కాదు, విటమిన్ C, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌తో రోగనిరోధక శక్తి పెంచి, చలి-జలుబు సమస్యలను దూరం చేస్తుంది.

చలికాలంలో లభించే సీతాఫలం శరీరానికి సహజ శక్తినీ రక్షణనూ ఇస్తుంది. విటమిన్లు, పోషకాలతో పలు రకాల వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

సీతాఫలంలో ఉన్న పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. విటమిన్ C చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి, క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

సీతాఫలంలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం, అసిడిటీ తగ్గిస్తుంది. కడుపు నిండుగా ఉంచి ఆకలి తగ్గించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

తీపి తినాలనుకునేవారికి సీతాఫలం ఉత్తమ ఎంపిక. తక్కువ కేలరీలతో సహజ తీపి ఇస్తుంది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు, పీసీఓఎస్ తగ్గించడంలో సహాయపడుతుంది.

సీతాఫలంలోని విటమిన్ B6 మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సెరటోనిన్, డోపమైన్ విడుదలను పెంచి ఒత్తిడి తగ్గిస్తుంది. ఇది శరీరం-మనస్సుకు సమతుల్యతను ఇస్తుంది.