250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ల వితరణ..

ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా, పువ్వాడ ఫౌండేషన్ -ఖమ్మం సంయుక్తంగా రూ.2.5 కోట్ల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాయి. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‍కుమార్ ఆధ్వర్యంలో వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్‍కు అందజేశారు. వీటిని అమెరికా నుంచి తెప్పించినట్టు, ఖమ్మం జిల్లా ప్రభుత్వ దవాఖానలో పేదలకోసం వినియోగించనున్నట్టు మంత్రి పువ్వాడ తెలిపారు. కాన్సంట్రేటర్ల దిగుమతికి సునీల్ చావలి సహకరించినట్టు వెల్లడించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్‍అలీ, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‍రావు తదితరులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.