Pratipati Pullarao:దేశానికే చంద్రబాబు రోల్‌మోడల్ : ప్రతిపాటి
ఎన్నికలు సజావుగా జరిగితే పులివెందులలో వైసీపీ గెలవదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు(Pratipati Pullarao) అన్నారు. ఈ నెల 12న జరగనున్న ఒంటిమిట్ట జడ్పీటీసీ (Ontimitta ZPTC) ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందుల (Pulivendula )లో గతంలో ఎప్పుడూ స్వేచ్చగా ఓటేసే పరిస్థితి లేదన్నారు. రౌడీ ముఠాలను తరిమికొట్టేందుకు పులివెందుల ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధిలో దేశానికే చంద్రబాబు(Chandrababu) రోల్‌మోడల్ అని అన్నారు. సూపర్ -6 పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు.







