వెల్ (WELL) ప్రీ-సర్టిఫికేషన్‌ను సాధించిన హైదరాబాద్‌లోని కాస్కేడ్స్ నియోపోలిస్
భారతదేశ రియల్ ఎస్టేట్ ఆకాంక్షలకు ప్రధాన ప్రోత్సాహకంగా, శక్తివంతమైన హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా, ది కాస్కేడ్స్ నియోపోలిస్‌కు ఇంటర్నేషనల్ వెల్ బిల్డింగ్ ఇన్స్టిట్యూట్ (IWBI) WELL v2 ప్రీ-సర్టిఫికేషన్ ప్లాటినం అవార్డును ప్రదానం చేసింది. ఈ గుర్తింపు ది కాస్కేడ్స్ నియోపోలిస్‌ను భారతదేశంలో మొట్టమొదటి , ప్రపంచంలోనే అతిపెద్ద నివాస అభివృద్ధిగా నిలుపుతుంది. మన పరిసరాలు శారీరక , మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై పూర్తిగా దృష్టి సారించిన ప్రపంచంలోనే మొట్టమొదటి భవన ప్రమాణం WELL అయినప్పటికీ, ఆరోగ్యం, వెల్నెస్-కేంద్రీకృత డిజైన్‌ను అభివృద్ధి చేయడానికి WELL బిల్డింగ్ స్టాండర్డ్‌ను అభివృద్ధి చేసి నిర్వహించే ప్రపంచ సాధికారత కలిగిన సంస్థ IWBI.
ఇంకా ప్రారంభించబడని, ది కాస్కేడ్స్ నియోపోలిస్ అనేది రూ. 3169 కోట్ల విలువైన 63 అంతస్తుల 217 మీటర్ల పొడవైన మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, ఇది జిహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్ పి యొక్క మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, ఇది ప్రధానంగా హైదరాబాద్‌లో కార్యక్రమాలను నిర్వహిస్తోన్న లెగసీ రియాలిటీ కంపెనీలు అయిన జిహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా మరియు అర్బన్‌బ్లాక్స్ రియాలిటీ ప్రమోటర్ల ఉమ్మడి కన్సార్టియం.
ఈ సర్టిఫికేషన్ నివాసితుల శ్రేయస్సుకు ఎలా ముఖ్యమైనది
WELL మూల్యాంకనంలో భాగంగా, ది కాస్కేడ్స్ నియోపోలిస్ నివాసితుల ఆరోగ్యమును నేరుగా ప్రభావితం చేసే పది అంతర్-సంబంధిత నేపథ్యంలలో అంచనా వేయబడింది: గాలి, నీరు, పోషణ, కాంతి, కదలిక, ఉష్ణ సౌకర్యం, ధ్వని, పదార్థాలు, మనస్సుమరియు సమాజం. అధునాతన వడపోత , వెంటిలేషన్ వ్యవస్థలు ద్వారా నివాసితులు మెరుగైన ఇండోర్ గాలి నాణ్యతను పొందుతారు. అధిక సహజ కాంతి , పగటిపూట కాంతి ఇళ్లలోకి అధికంగా రావటం , ఉద్గారాలను తగ్గించడానికి, శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి జాగ్రత్తగా ఎంచుకున్న పదార్థాల ద్వారా మెరుగైన అనుభవాలను పొందుతారు. ఒత్తిడి, అలసటను తగ్గించడానికి ఉష్ణోగ్రత, శబ్ద నియంత్రణలు ఏకీకృతం చేయబడ్డాయి. మొత్తం లేఅవుట్ తోటి నివాసితులతో అనుబంధం పెంచుకోవటానికి, మైండ్‌ఫుల్‌నెస్ మరియు పరస్పర సంభాషణలను ప్రోత్సహిస్తుంది. ఎక్కువ సమతుల్యత మరియు శక్తితో కూడిన జీవనశైలిని ప్రోత్సహించడానికి డిజైన్‌లోని ప్రతి అంశం క్రమాంకనం చేయబడింది.
భారతదేశంలో ఇంతకు ముందు ఎన్నడూ ఊహించని వెల్నెస్-కేంద్రీకృత జీవన ప్రమాణాలు
మన దేశంలో వాణిజ్య ప్రాంగణాలు గతంలో WELL సూత్రాలను స్వీకరించడాన్ని చూసినప్పటికీ, ది కాస్కేడ్స్ నియోపోలిస్ ఆరోగ్యకరమైన జీవనాన్ని సులభతరం చేసే ఉన్నత ప్రమాణాలను నిర్ణయించే నివాస ప్రాజెక్టుల ముందుచూపుకు మార్గదర్శకత్వం వహించింది. ఈ ప్రాజెక్ట్ నివాస కమ్యూనిటీల రూపకల్పనలో ప్రాథమిక మార్పును సూచిస్తుంది, ఇది సౌకర్యం , సౌలభ్యంలో మాత్రమే కాకుండా, ఉద్దేశించిన వెల్నెస్లో కూడా కనిపిస్తోంది.
ఇది నేటి ప్రపంచంలో ఏమి సాధ్యమవుతుందో దానికి నిదర్శనం మాత్రమే కాదు, రేపటి ఇళ్లను ఎలా నిర్మించవచ్చో ఒక బ్లూప్రింట్ కూడా.
“దాదాపు 5.43 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో, తదుపరి అతిపెద్ద WELL ప్రీ-సర్టిఫైడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ కంటే రెట్టింపు పరిమాణంలో, ది కాస్కేడ్స్ నియోపోలిస్ మొట్టమొదటిసారి అనతగ్గ ఫీచర్లను కలిగి ఉంటుంది. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే, పూర్తి స్థాయి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా 42 శాతం నీటి పొదుపును అందిస్తుంది. సౌర మరియు అధిక-సామర్థ్య వ్యవస్థలతో వార్షిక విద్యుత్ వినియోగాన్ని 30 శాతం తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ రూపొందించబడింది. నిర్మాణ సమయంలో, 95 శాతం శిథిలాలను రీసైకిల్ చేస్తారు. 30 శాతం పార్కింగ్ బేలు ఈవీ ఛార్జర్లతో అమర్చబడి ఉంటాయి. ఆరోగ్యకరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న జీవనానికి కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి” అని కన్జర్వ్ కన్సల్టెంట్స్ (ప్రైవేట్) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జుజర్ ఎస్. కొఠారి అన్నారు (వెల్ v2 ప్రీ-సర్టిఫికేషన్ ప్లాటినం మరియు ఐజిబిసి గ్రీన్ హోమ్స్ ప్లాటినం ప్రమాణాలను పొందేందుకు కాస్కేడ్స్ నియోపోలిస్తో భాగస్వామ్యం కలిగి ఉన్న సంస్థ).
“ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు, రియాల్టీ కన్సల్టెంట్లు , సస్టైనబిలిటీ నిపుణులు కలిసి వచ్చినప్పుడు, లోతైన డిజైన్ ఆలోచన ద్వారా నివాసితుల జీవితాన్ని పునర్నిర్మించడం మా లక్ష్యం. మీరు మీ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు, WELL v2 ప్రీ-సర్టిఫికేషన్ ప్లాటినం మరియు ఐజిబిసి గ్రీన్ హోమ్స్ ప్లాటినం మద్దతుతో మీరు స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా సహజ కాంతి మరియు ఆరోగ్యం కోసం ఆలోచనాత్మకంగా రూపొందించిన స్థలాల నుండి ప్రయోజనం పొందుతారు. సాంప్రదాయ లగ్జరీకి మించి భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న జీవన ప్రదేశాలను రూపొందించడంలో, నివాసితుల శ్రేయస్సు, పర్యావరణ బాధ్యత , కమ్యూనిటీ-కేంద్రీకృత డిజైన్‌కు ప్రాధాన్యత ఇచ్చే దార్శనికతను కలిగి ఉండటంలో ప్రాజెక్ట్ నాయకత్వాన్ని ఈ మైలురాయి నొక్కి చెబుతుంది” అని జిహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్ పి యొక్క భాగస్వాములు, శ్రీ కర్తేష్ రెడ్డి ఎం (జిహెచ్ఆర్ ఇన్ఫ్రాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ), శ్రీ లక్ష్మీ నారాయణ జి (లక్ష్మీ ఇన్ఫ్రాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు) మరియు శ్రీ శరత్ వి, (అర్బన్‌బ్లాక్స్ రియాలిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ) సంయుక్త ప్రకటనలో అన్నారు.







