TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో… సోషల్ మీడియా ఇంటర్న్ షిప్ ప్రారంభం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మిడ్ అట్లాంటిక్ టీమ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా మాస్టర్ మైండ్ ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు. డిజిటల్ మీడియా, కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో మిడ్ అట్లాంటిక్ టీమ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 4 వారాల ఆన్లైన్ ప్రోగ్రామ్ ఆగస్ట్ 1 నుండి 29 వరకు జరుగుతుంది.
తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ తానా రీజినల్ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ వెంకట్ అడుసుమిల్లి, మిడ్ అట్లాంటిక్ తానా కమ్యూనిటీ నాయకులు సతీష్ తుమ్మల తదితరులు ఈ కార్యక్రమం ప్రారంభ సందర్భంగా అమూల్యమైన సందేశాలను ఇవ్వడంతోపాటు ఈ అవకాశాన్ని హైస్కూల్ విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం నిర్వహణలో తగిన సూచనలు, మార్గదర్శకత్వం చేస్తున్న Gifted Gabber CEO జ్యోత్స్న కేథర్ మరియు రించ్ లకు తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ తరపున ధన్యవాదాలను తెలియజేస్తున్నట్లు సతీష్ తుమ్మల, ఫణి కంతేటి తెలిపారు.
ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యాలను ఫణి కంతేటి వివరిస్తూ, వివిధ ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లను ఎలా ఉపయోగించుకోవడంతోపాటు, వీడియోలు, గ్రాఫిక్స్ రూపకల్పన, మార్కెటింగ్ మెళకువలు, బ్రాండింగ్, ప్లానింగ్ వంటి విషయాలను ఈ సోషల్ మీడియా ఇంటర్న్ షిప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీల్లో ఈ కార్యక్రమం ఉంటుందని, సమయం సాయంత్రం 6 నుంచి 7వరకు (ఇఎస్ టి టైమ్) జరుగుతుందని ఆయన వివరించారు. ఈ
కార్యక్రమానికి సంబంధించిన వివరాలకోసం 610 620 4135లో సంప్రదించవచ్చన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన తానా మిడ్-అట్లాంటిక్ బృందానికి, తానా నాయకులకు బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి ధన్యవాదాలు తెలియజేశారు.







