Minister Lokesh :ఇలాంటి దాడులకు ఏపీలో చోటులేదు : మంత్రి లోకేశ్
తిరుపతిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakara Reddy) అనుచరులు రెచ్చిపోతుండటంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నేతల బుద్ధిమారడం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ (Dr. Sudhakar) దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం (Subramaniam) డెడ్‌బాడీ డోర్ డెలివరీ వరకు దళితులపై దమనకాండ జరిపిన ఆ నేతలు, ఇప్పుడూ అదే పంథా కొనసాగిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తిరుపతిలో వైసీపీ నేతలు ఓ యువకుడిపై చేసిన దాడిన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి దాడులకు ఏపీలో చోటులేదన్నారు. రప్పా రప్పా అంటే ఏపీ పోలీసులు (Police) రఫ్పాడిస్తారని హెచ్చరించారు.







