ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డా.వేమూరు రవికుమార్ గారి కుమారుడి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు(ఏపీఎన్ఆర్టీ) సొసైటీ అధ్యక్షుడు డా.వేమూరు రవి కుమార్ గారి కుమారుడి వివాహ వేడుకలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు కిరణ్, పుష్పలతలను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
అంతకుముందు విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి లోకేష్.. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.








