Minister Ramprasad : ఆగస్టు 15 నుంచి శ్రీ శక్తి పేరుతో .. మహిళలకు : రాంప్రసాద్ రెడ్డి
ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సు (RTC bus) లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy)తెలిపారు. సచివాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ శక్తి (Sri Shakti) పేరుతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రారంభిస్తారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు. మహిళలు తమ ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు (Ration card) లో లేదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. 6,700 బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనికోసం రూ.1,950 కోట్ల వ్యయం అవుతుంది. 3 వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు సీఎం ఆదేశించారు. రానున్న రెండేళ్లలో 1,400 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తాం అని తెలిపారు.







