Minister Nimmala : చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలతో పాటు ప్రకృతి కూడా : మంత్రి నిమ్మల
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 312 టీఎంసీలకు గాను, 302 టీసీఎంలకు చేరుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దీంతో 18 ఏళ్ల తర్వాత జులైలోనే సాగర్ గేట్లు (Sagar Gates ) ఎత్తారని తెలిపారు. చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వానికి ప్రజలతో పాటు ప్రకృతి కూడా సహకారం అందిస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే ముందు వరకు సాగర్ ఆయుకట్టుకు క్రాప్ హాలీడే (Crop Holiday) ప్రకటించారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పుష్కలంగా నీరందించి పంటలు పండిరచామని తెలిపారు. వరద నీటిని వృథాగా సముద్రంలోకి వదలకుండా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.







