Minister DBV Swamy: చంద్రబాబుపై నమ్మకంతో ఏపీకి పరిశ్రమలు క్యూ : మంత్రి డోలా
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), మంత్రి లోకేశ్ (Lokesh) అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయస్వామి( డీబీవీ స్వామి) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో పెట్టుబడుల పేరుతో వైసీపీ (YCP) నేతలు విదేశాల్లో విహారయాత్రలు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. జగన్ తన విధ్వంస పాలనలో సింగపూర్‌తో రాష్ట్రానికి ఉన్న సత్సంబంధాలు దెబ్బతీశారని మండిపడ్డారు. నేడు చంద్రబాబుపై నమ్మకంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. చంద్రబాబు అపోలో టైర్స్ కంపెనీ తెచ్చారు. గత ఐదేళ్లలో జగన్ కనీసం సైకిల్ ట్యూబ్ కంపెనీ (Bicycle tube company) అయినా తెచ్చారా అని ఎద్దేవా చేశారు. పరిశ్రమలు, పెట్టుబడులతో రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నామన్నారు. నాడు కాకమ్మ కథలు చెప్పిన వారు నేడు పెట్టుబడులపై విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.







