Atchannaidu : కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే.. మొదలుపెట్టాం
జగన్ హయాంలో రైతులకు రూపాయికే బీమా అమలు చేస్తామని జగన్ మూడేళ్ల పాటు ప్రీమియం ఎగ్గొట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ (Assembly) లో బీమా చెల్లించామని అబద్ధాలు చెప్పడమే కాకుండా, జీవో కూడా లేకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. రూ.3.138 కోట్ల బీమా బకాయిలు పెండిరగ్లో ఉండేందుకు కారణం అప్పటి ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడమేనన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బీమా పథకం మళ్లీ మొదలుపెట్టామని చెప్పారు. అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhav) పథకం కింద ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో రూ.3,156 కోట్లు జమ చేస్తామని తెలిపారు. పులివెందుల (Pulivendula) రిజార్వాయర్ నీటిని రైతులకు కాకుండా బంధువుల కంపెనీలకు జగన్ (Jagan) మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.







