Chandrababu: అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu, ) తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhav) పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసి అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. రైతుల చెప్పిన సమస్యలపై స్పందించిన చంద్రబాబు .. వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెబుతామన్నారు.
రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ది పొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీనికి తోడుగా కేంద్రం పీఎం కిసాన్ (PM Kisan) పథకం కింద మొదటి విడతగా రూ.2 వేల చొప్పున రైతులకు సాయం అందిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7 వేలు చొప్పున జమ చేశాయి. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు (Atchannaidu) , ఆనం రామనారాయరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulu Reddy) ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







