Minister Savita : మేం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొంటాం : మంత్రి సవిత
వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, ఘర్షణలు చూసి తన తండ్రి వైఎస్ వివేకా జయంతి (YS Viveka Jayanti) కి పులివెందులకు రావాలంటేనే సునీత (Sunita) భయపడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Savita )అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వరుసగా మూడ్రోజులపాటు జరుగుతున్న దాడులన్నీ వైసీపీ వారే చేసుకొని ఆ నెపాన్ని టీడీపీ (TDP) పై వేసి ఉంటారని సునీత ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. దీన్ని బట్టే పులివెందులలో వైసీపీ నేతల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పులివెందుల వైసీపీ నాయకులు ఓడిపోతారనే భయంతోనే ధర్నాలు, పోలీసులను బెదిరించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొంటాం. జగన్(Jagan) రప్పా రప్పా అనే వ్యాఖ్యలు, వైసీపీ నేతలు మాట్లాడుతున్న అసభ్యకరమైన మాటలు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. సూపర్సిక్స్ పథకాలు, ఏడాది నుంచి పులివెందులలో ప్రశాంతతతో ఇక్కడి రెండు స్థానాలు టీడీపీ గెలుచుకుంటుంది అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.







