Nadendla Manohar : అక్రమాలకు అస్కారం లేకుండా క్యూఆర్ కోడ్‌తో : మంత్రి నాదెండ్ల
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్ రేషన్‌కార్డులు (Smart ration cards) పంపిణీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వెల్లడిరచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమాలకు అస్కారం లేకుండా క్యూఆర్ కోడ్ (QR code) తో ఈ కార్డులను రూపొందించినట్లు తెలిపారు. కొత్తగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారం. రాష్ట్రంలో 29,796 రేషన్ షాపుల్లో ప్రతినెలా 1 నుంచి 15 వరకు ఉదయం 8 గంటలను మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 వరకు రేషన్ సరఫరా చేస్తున్నాం. ఐదేళ్లలోపు 80 ఏళ్లు దాటిన వారికి ఈకేవైసీ (EKYC) అక్కర్లేదు అని తెలిపారు.







