Radha Spaces ASBL

ప్రవాస భారతీయులపై ట్రంప్‌ ప్రశంసల జల్లు

ప్రవాస భారతీయులపై ట్రంప్‌ ప్రశంసల జల్లు

ప్రవాస భారతయులను చూసి తాను ఎంతో గర్విస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. అమెరికా అభివృద్ధిలో వారు గొప్ప పాత్రను పోషించారని కోనియాడారు. టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమానికి ట్రంప్‌ హాజరైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ప్రవాస భారతీయులను ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్‌ ప్రయత్నించారు. హౌడీ మోదీ ని చారిత్రాత్మక సభగా అభివర్ణించారు. అమెరికావ్యాప్తంగా ఉన్న దాదాపు 40 లక్షల మంది ప్రవాస భారతీయులకు కృజత్ఞతలు తెలిపారు. మీరంత కష్టపడి పనిచేస్తారు. మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. వైద్యం, సాంకేతిక రంగాల్లో కొత్త టెక్నాలజీతో ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నారు. వేలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నారు. అమెరికా సంస్కృతిని, విలువలను సుసంపన్నం చేశారు. మీరు అమెరికన్లయినందుకు నేను నిజంగా చాలా గర్విస్తున్నా అని పేర్కొన్నారు. తనను మించిన నిజమైన స్నేహితుడు భారత్‌కు మరొకరు లేరని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

 

 

Tags :