Radha Spaces ASBL

కెసిఆర్ గారు జాతీయ రాజకీయాలోకి రావాలి ! ఎన్నారైలంతా కెసిఆర్ వెంటే !

కెసిఆర్ గారు జాతీయ రాజకీయాలోకి రావాలి ! ఎన్నారైలంతా కెసిఆర్ వెంటే !

ఆటా (అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్‌) మహాసభలకు విచ్చేసిన సందర్బంగా తెరాస USA అద్వ్యర్యములో ఎమ్మెల్సీ కవిత, వివిధ మంత్రులు, ఎమ్మెలేలు, చైర్మన్ లతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. తెరాస USA విభాగం తరపున నరసింహ స్వాగతం పలికారు. తరువాత తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ తెరాస శాఖల పనితీరును వివరిస్తూ ప్రపంచములో 50  కి పైగా దేశాలలో శాఖలు వున్నా ఏకైక పార్టీ  తెరాస పార్టీ అని, దేశ రాజకీయాలలో కేసీఆర్ గారి నాయకత్వం అవసరం అని ఎన్నారైలలంతా కోరుకుంటున్నారని మహేష్ బిగాల తెలిపారు.

ఈ కార్యక్రమములో హాజరైన ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ మోదీ ప్రభుత్వరంగ సంస్థలను తన స్నేహితుడు అదానీకి కట్టబెడుతున్నారని, అసలు దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారా? అదానీ ఉన్నారా? అనే అనుమానం కలుగుతుందని అన్నారు. అలాగే రైతులు, పేదలు రెండు కండ్లుగా సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిపిన దార్శనికుడు కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం దేశానికి రోల్‌ మాడల్‌గా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్‌ కోతలు లేవని, తాగునీటి వెతలు లేవని, వలసలు అసలే లేవని పేర్కొన్నారు. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక వాటా తెలంగాణ ఇస్తున్నదని గుర్తుచేశారు. బీజేపీకి ఒక విధానం, నినాదం లేదని.. కేవలం విద్వేశాలను రెచ్చగొట్టమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు. కశ్మీర్‌లో మత రాజకీయం అన్నిచోట్లా విద్వేష రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఆరు దశాబ్దాలుగా దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దిక్కు లేకుండాపోయిందన్నారు. దేశాన్ని గడిచిన ఎనిమిదేండ్లుగా సాగుతున్న మోదీ పాలనలో దారిద్య్రం మరింత పెరిగి పోయిందని విమర్శించారు. బీజేపీ పాలనలో తెలంగాణకు పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. యావత్ భారత్‌ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు.

జై భారత్, జై కెసిఆర్, జై తెలంగాణ నినాదాలతో ఎన్నారైలు నినదించారు కెసిఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని సంపూర్ణ మద్దతు తెలిపారు. దేశ రాజకీయాలలో కేసీఆర్ నాయకత్వం అవసరం అని పాల్గొన తెరాస నేతలు అన్నారు. అలాగే అమెరికా తెరాస తో పాటు వివిధ దేశాలలో వున్నా తెరాస శాఖలు వారి వారి వృత్తులు నిర్వహిస్తూనే పార్టీకి అన్ని రకాలుగా మద్దతునిస్తున్నారు. అన్ని దేశాల  తెరాస శాఖలను ఎమ్మెల్సీ కవిత  అభినందిచారు. ఈరోజు ఆట సభలకు హాజరైన తెరాస బృందానికి  అన్ని రకాల ఏర్పాట్లు చేసి కృషి చేసినందుకు USA తెరాస శాఖను ప్రత్యేకంగా ఎమ్మెల్సీ కవిత అభినందించారు.

ఈ కార్యక్రమానికి  తెలంగాణ మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, చామ‌కూరి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్సీ క‌విత‌, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య , గాద‌రి కిషోర్‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, గువ్వల బాలరాజు, చంటి క్రాంతి కిర‌ణ్‌, బొల్లం మల్లయ్య, టిఎస్ఐఐసి చైర్మ‌న్ గాద‌రి బాల‌మ‌ల్లు, USA తెరాస సభ్యులు పూర్ణ  బైరి, నరసింహారావు నాగులవంచా, అనిల్ ఎర్రబెల్లి, రవి ధన్నపనేని, సక్రు నాయక్, నవీన్ జలగం మరియు USA తెలంగాణ జాగృతి నుంచి పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :