నవంబర్ 15న తెలంగాణ విజయ గర్జన : కేటీఆర్

నవంబర్ 15న తెలంగాణ విజయ గర్జన : కేటీఆర్

నవంబర్‌ 15న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌ మంత్రి మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది కార్యకర్తలతో తెలంగాణ విజయ గర్జన పేరుతో ఈ సమావేశాని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ గ్రామ, వార్డు, మండల, పట్ట, డివిజన్‌ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు హాజరు కావాలన్నారు.  లక్షలాదిగా తరలిరాలని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్‌ 27న నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఈ సన్నాహక సమవేశాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒకే రోజు నిర్వహించనున్నాం అని కేటీఆర్‌ తెలిపారు.

 

Tags :