Radha Spaces ASBL

కెనడాలో తాకా వారి శుభకృత్ నామ సంవత్సర ఉగాది అంగరంగ వైభవంగా ఉత్సవాలు 

కెనడాలో తాకా వారి శుభకృత్ నామ సంవత్సర ఉగాది అంగరంగ వైభవంగా ఉత్సవాలు 

కెనడా లో తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా (తాకా) శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను టొరంటో లోని టొరంటో పెవిలియన్ వేదిక నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమము ను 1200 మందికి పైగా కెనడా లోని తెలుగు వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రేణు కుందెమ్, అనిత సజ్జ, ఖాజిల్ మహమ్మద్, విద్య భవనం వ్యాఖ్యాతలు గా వ్యవహరించారు.  

మొదటగా తాకా అధ్యక్షులు కల్పనా మోటూరి మరియు రంజిత హంసాల, రజిని లయం, గీత దేసు, వీణ మార్పిన గారు జ్యోతి ప్రజ్వలనతో ఉగాది సంబరాల ను ప్రారంభించారు. పిమ్మట కెనడా మరియు భారత దేశ జాతీయ గీతాలను ఆలపించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి టొరంటో ఇండియన్ కాన్సులేట్ జనరల్ శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. అపూర్వ గారు తాకా విశిష్టత గురించి, టొరంటో లోని తెలుగు కమ్యూనిటీ కోసం తాకా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొనియాడారు. తాకా అధ్యక్షులు శ్రీమతి కల్పన మోటూరి మరియు తాకా కార్య వర్గ సంఘం శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ గారి ని సత్కరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన ధాత అయిన గెట్ హోమ్ రియాల్టీ (రమేష్ గొల్లు గారు, ఆనంద్ పేరిచర్ల గారు) ని సత్కరించుకోవడం మరియు మొమెంటో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాకా కార్యవర్గం తాకా ప్రధాన వ్యవస్థాపక సభ్యులు అయిన శ్రీ చారి సామంతపూడి గారు చేసిన మరియు కమ్యూనిటీ కి చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాలని ఎంతగానో ప్రశంసించి చిరు సత్కారంతో గౌరవించడం జరిగింది. తాకా అధ్యక్షులు శ్రీమతి కల్పన మోటూరి గారు తాకా వ్యవస్థాపకతను వివరిస్తూ తాకా చేస్తున్న కార్యక్రమాలను, ముఖ్యంగా పోయిన రెండు సంవత్సరాలలో జరిపించిన కార్యక్రమాలను వివరించారు.      

టొరంటో లో వున్న తెలుగు పూజారి శ్రీ మంజునాథ సిద్ధాంతి గారు ఉగాది పంచాంగ శ్రవణం మరియు ఈ కొత్త సంవత్సర రాశి ఫలాలను  అందరికీ విశదీకరించారు. ఆరు గంటల పాటు దాదాపు 35 సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా సాగింది. 130 కి పైగా చిన్నారులు మరియు పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక మరియు చలన చిత్ర నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షో, పాడిన గీతాలు అందరినీ అలరించాయి.  

ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరాల, రాణి మద్దెల, యూత్ డైరెక్టర్స్ విద్య భావనం, ఖాజిల్ మహమ్మద్ మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక  మరియు ఇతర వ్యవస్థాపక చైర్మన్  రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం, లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి,  శ్రీనాథ్  కుందూరు, రామ చంద్ర రావు దుగ్గిన మరియు అందరి వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వఛ్చంద కార్యకర్తలకు తాకా కార్యవర్గం ధన్య వాదములు తెలిపారు. చివరిగా తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, అరుణ్ లయం, తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి గారు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు వారందరికీ, దాతలకు, అతిధులకు ఇఛ్చిన వందన సమర్పణ తో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.

 

Click here for Event Gallery

 

 

 

Tags :