Radha Spaces ASBL

తానా బ్యాలెట్ల మెయిల్‌ ఆలస్యం...

తానా బ్యాలెట్ల మెయిల్‌ ఆలస్యం...

ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో చివరి అంకమైన పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో జాప్యం జరుగుతోంది. గతంలో నిర్వహించిన షెడ్యూల్‌ ప్రకారమైతే ఈపాటికే పోస్టల్‌ బ్యాలెట్‌ అందరికీ పంపించాల్సి ఉంది. చివరినిముషంలో అడ్రస్సు విషయంలో తేలిన పొరబాట్లు జాప్యానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటనను తానా విడుదల చేసింది. తానా ఎన్నికల నిర్వహణను ది ఎలక్షన్‌ ట్రస్ట్‌ అనే సంస్థ చూస్తోందని, ఈ సంస్థ జాతీయ స్థాయిలో సంస్థాగత, కార్పొరేట్‌ ఎన్నికల నిర్వహణలో పేరుగాంచిందని, తానా ఎన్నికల ప్రక్రియ డిజైనింగ్‌, మెయిలింగ్‌ మరియు లెక్కింపు మొత్తం ఈ సంస్థే చేయాల్సి ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా తానాకు చెందిన ఎలక్షన్‌ కమిటీ అందించిన మెయిలింగ్‌ జాబితాను ఎలక్షన్‌ ట్రస్టుకు పంపుతుంది. అయితే ఇలా పంపిన జాబితాలోని సభ్యుల  అడ్రసును నేషనల్‌ ఛేంజ్‌ ఆఫ్‌ అడ్రస్‌(ఎన్‌సీవోఏ) డేటాబేస్‌లో ఎలక్షన్‌ ట్రస్టు చెక్‌ చేస్తుంది. ఆపై సభ్యుల చిరునామా ఆధారంగా వారు బ్యాలెట్లు ఏ ప్రాంతంలో మెయిల్‌ చేయాలో తేలుస్తారు. అయితే ఈసారి బ్యాలెట్ల ముద్రణ తర్వాత ఇవి చేరాల్సిన ప్రాంతాకు చేరలేదని తేలింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి బ్యాలెట్లను మళ్లీ ముద్రించడమే సరైన నిర్ణయమని ఎలక్షన్‌ కమిటీ, ఎలక్షన్‌ ట్రస్టు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆ తర్వాత వాటిని ఆయా ప్రాంతాకు పంపుతారు. దీని వ్లల్ల బ్యాలెట్లు ఆలస్యమైనట్లు తానా ఎలక్షన్‌ కమిటీ పేర్కొంది. ఇదే క్రమంలో మిగతా ఎన్నికల  ప్రక్రియను పూర్తి చేయడం కోసం ఎలక్షన్‌ ట్రస్టుతో కలిసి కొత్తగా ఎలక్షన్‌ షెడ్యూల్‌ను ప్రకటించాని తానా బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లను కోరింది. ఈ నూతన షెడ్యూల్‌ను సభ్యులకు బ్యాలెట్లు పంపేటప్పుడే వెల్లడిస్తామని, తానా వెబ్‌సైటులో ప్రచురిస్తామని తానా నామినేషన్స్‌ అండ్‌ ఎలక్షన్స్‌ కమిటీ(ఎన్‌/ఈ) ఆ ప్రకటనలో పేర్కొంది.

Tags :