Radha Spaces ASBL

వల్లేపల్లి శశికాంత్‌ ఆధ్వర్యంలో తానా మెగా కార్యక్రమం విజయవంతం

వల్లేపల్లి శశికాంత్‌ ఆధ్వర్యంలో తానా మెగా కార్యక్రమం విజయవంతం

గుడివాడ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, తానా నాయకులు

తానా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా తానా ఫౌండేషన్‌ కార్యదర్శి శశికాంత్‌ వల్లేపల్లి గుడివాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సూపర్‌ హిట్టయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌,  గౌరవ అతిథులుగా రావి వెంకటేశ్వర రావు, వర్ల కుమార్‌ రాజ, రోటరీ క్లబ్‌ గుడివాడ వారు పాల్గొన్నారు. తొలుత  శశికాంత్‌ వల్లేపల్లి అతిధులను వేదిక మీదకు ఆహ్వానించారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పాంత్రాతోపాటు ముఖ్య అతిధులు, ఇతరులు వేదికపై కూర్చున్నారు. 

కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ అమెరికాలో ఎవరి పనులు వారు చేసుకొంటూ, ఉద్యోగాలలో ఎదుగుతూ మరోవైపు తెలుగు రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారిని అభినందించడంతోపాటు, వారికి అవసరమైన మద్దతును కూడా మనం ఇవ్వాలని కోరారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, తానా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న   అనేక సహాయ కార్యక్రమాలను వివరించారు. 2 డిసెంబర్‌ నుంచి 4 జనవరి వరకు జరిగే తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు. 

తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ వేంకట రమణ యార్లగడ్డ మాట్లాడుతూ తానా ఫౌండేషన్‌ ద్వారా ప్రతి సేవా కార్యక్రమానికి టార్గెట్స్‌ పెట్టుకొని వాటిని అధిగమిస్తున్నామని చెప్పారు. 1000 మంది కి స్కాలర్‌ షిప్‌లు ఇవ్వాలని అనుకొని ఇప్పటికే 1000 మంది ఇవ్వటం జరిగిందని, అలాగే 50 క్యాన్సర్‌ క్యాంప్‌ లు చేద్దామని టార్గెట్‌ పెట్టుకుంటే, ఇప్పటికే 48 క్యాంప్‌ లు చేశామని తెలిపారు. ఈ విధంగా ప్రతి సేవా కార్యక్రమానికి ఒక నంబర్‌ టార్గెట్‌ పెట్టుకొని చేస్తున్నామని, ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయటానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలపాలన్నారు.

తానా సెక్రెటరీ సతీష్‌ వేమూరి మాట్లాడుతూ తానా టీమ్‌ స్క్వేర్‌ ద్వారా అమెరికా లో ఆపద, విపత్కర సమయాలలో ఏ విధంగా సహాయం చేస్తున్నామో వివరించారు. 
ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్‌ విద్యార్థినులకు తానా చేయూత ద్వారా 55 మంది కి స్కాలర్‌ షిప్‌ లు, తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 కుట్టు మిషన్‌ లు, 15 సైకిల్స్‌, 4 వీల్‌ చైర్స్‌  బహూకరించారు. నేత్రవైద్యశిబిరం, ఇఎన్‌టి, క్యాన్సర్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేసి అనేకమందికి పరీక్షలు చేసి చికిత్స చేశారు.

ఈ కార్యక్రమంలో శశికాంత్‌ వల్లేపల్లి తండ్రి శ్రీ వల్లేపల్లి సీతారామ్మోహన్‌ రావు గారు పేరు మీద రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గుడివాడ - రోటరీ కమ్యూనిటీ సర్వీస్‌ ట్రస్ట్‌, గుడివాడ వారికి 850,000 రూపాయల వ్యయంతో వైకుంఠ రథంను బహూకరించారు.

తానా నాయకులు సతీష్‌ వేమూరి, పురుషోత్తం గూడె, శశాంక్‌ యార్లగడ్డ, శ్రీమతి ఉమా కటికి, జోగేశ్వర రావు పెద్దిబోయిన, టాగోర్‌ మలినేని, రాజ కసుకుర్తి, రావు మొవ్వా, శ్రీనివాస ఓరుగంటి, నాగ పంచుమర్తి, రఘు ఎద్దులపల్లి, వెనిగళ్ళ రాము, తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ శ్రీ సుబ్బారావు చెన్నూరి, టిఎన్‌ఐ లైవ్‌ ఎడిటర్‌ ముద్దు కృష్ణ నాయుడులను శశికాంత్‌ వల్లేపల్లి వేదిక మీదకు ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. 
 
 

Click here for Event Gallery

 

 

 

Tags :