Radha Spaces ASBL

అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో పెద్దఅవుటపల్లిలో తానా సేవలు విజయవంతం

అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో పెద్దఅవుటపల్లిలో తానా సేవలు విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెద్దఅవుటపల్లిలో తానా చైతన్య స్రవంతి సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. తానా సర్వీసెస్‌ డే సందర్భంగా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి గ్రామంలో ఆర్‌సిఎం స్కూల్‌ నందు డిసెంబర్‌ 26వ తేదీ ఉదయం 08:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగిన సేవా కార్యక్రమాలు, ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు, ఆర్థోపెడిక్‌ పరీక్షలు,  చెవి ముక్కు గొంతు పరీక్షలను నిర్వహించారు. ఉంగుటూరు మండలంలోని 27 గ్రామాల ప్రజలు గన్నవరం,  దావాజి గూడెం, అల్లపురం, మర్లపాలెం గ్రామాల నుండి కూడా ప్రజలు ఈ వైద్యశిబిరాలకు తరలివచ్చారు. 

ఉచిత మెగా క్యాన్సర్‌ క్యాంపును తానా ఫౌండేషన్‌, గ్రేస్‌ ఫౌండేషన్‌ వారిచే నిర్వహించారు. ఉచిత మెగా వైద్య శిబిరం  టాప్‌ స్టార్‌ హాస్పిటల్స్‌ విజయవాడ ఆధ్వర్యంలో జరిగింది. తానా క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టారు.  రైతుకోసం కార్యక్రమంలో రైతులకు రక్షణ కిట్లను పంపిణీ చేశారు. తానా చేయూత ద్వారా 20 మంది అనాధ పిల్లలకు స్కాలర్‌షిప్‌లను ఇచ్చారు. జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ అబివృద్ధి కోసం 1,00,000 డొనేషన్‌ను ఈ సందర్భంగా ప్రకటించారు.  ఈ సందర్భంగా లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియచేశారు. లావు ఫౌండేషన్‌ ద్వారా పెద్ద అవుటపల్లి గ్రామంలో మరెన్నో ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 

ఈ కార్యక్రమానికి తానా ప్రతి నిధులు మరియు రాజకీయ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కిరణ్‌ కలపాల కో ఆర్డినేట్‌ చేసుకొని తమ సహకారం అందించారు.  

తానా నాయకులు లావు అంజయ్య చౌదరి - తానా అధ్యక్షులు, వెంకట రమణ యార్లగడ్డ - తానా ఫౌండేషన్‌ చైర్మన్‌, సతీష్‌ వేమూరి - తానా తానా సెక్రటరి, సతీష్‌ వేమన - మాజీ తానా అధ్యక్షులు, రవి పొట్లూరి 2023 తానా మహాసభల కన్వీనర్‌, సునీల్‌ పాంత్ర తానా చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్‌, రాజా కసుకుర్తి తానా కమ్యూనిటి సర్వీసెస్‌, సురేష్‌ పుట్టగుంట - ఫౌండేషన్‌ ట్రస్టీ, శ్రీనివాస్‌ ఒరుగంటి - ఫౌండేషన్‌ ట్రస్టీ, శశాంక్‌ యార్లగడ్డ - స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌, ఠాగోర్‌ మలినేని - మీడియా కో ఆర్డినేటర్‌,  శ్రీనివాస్‌ కోకట్ల - ఈవెంట్స్‌  కో ఆర్డినేటర్‌, జోగేశ్వరరావు పెద్దిబోయిన, లక్ష్మినారాయణ సూరపనేని, అనిల్‌ లింగమనేని, గన్నే రమణ, వంశీ కోట, రమేష్‌ యలమంచిలి,  శ్రీనివాస్‌ నాదెండ్ల, అనిల్‌ యలమంచిలి, శ్రీనివాస్‌ తాతినేని, సుమంత్‌ పూసులూరు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ప్రజా ప్రతినిధులు లావు రత్తయ్య - విజ్ఞాన సంస్థల అధినేత, శ్రీ కృష్ణ దేవరాయులు - నరసరావుపేట ఎంపీ, కంభంపాటి  రామ మోహనరావు, మాజీ రాజ్య సభ సభ్యులు, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లరావు, మాజీ మంత్రి కూన రవికుమార్‌, మాజీ విప్‌, ఆముదాలవలస, ఆరుమళ్లీ రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, తణుకు, బచ్చుల అర్జునుడు ఎమ్మెల్సీ, గన్నవరం, యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్‌ మాజీ ఎమ్మెల్సీ, గన్ని కృష్ణ, మాజీ గూడా చైర్మన్‌, కొమ్మరెడ్డి పట్టాభి టీడిపి అధికార ప్రతినిధి, కేశినేని చిన్ని, సీనియర్‌ టిడిపి నాయకులు రాము వెనిగళ్ల, సీనియర్‌ నాయకులు,  కొనగల్ల బుల్లయ్య, రాష్ట్ర సెక్రటరీ, ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రావు,  నీటి సంఘాల అధ్యక్షులు మూల్పూరి సాయి కళ్యాణి, తెలుగు మహిళ కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 

Click here for Photogallery

 

 

Tags :