ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గోకరాజుపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతం

గోకరాజుపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతం

సాంస్కృతిక కార్యక్రమాలు, స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్యశిబిరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న చైతన్యస్రవంతి వేడుకల్లో భాగంగా కృష్ణా జిల్లా, వీరులపాడు మండలంలోని గోకరాజుపల్లిలో తానా అపలాచియన్‌ రీజియన్‌ సమన్వయకర్త నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన తానా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు 6 లక్షల రూపాయల విలువ చేసే స్కాలర్‌షిప్‌లు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్, మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు బైసికిల్స్  పంపిణీ చేశారు. ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వారికి పరిక్షలు మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వచ్చారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, తానాఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డ, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పాంత్రాతోపాటు రాజా కసుకుర్తి, ఉమా కటికి, శ్రీనివాస్‌ కూకట్ల, శశాంక్‌ యార్లగడ్డ, జోగేశ్వరరావు పెద్దిబోయిన, ఠాగూర్‌ మలినేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంజయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రపంచంలోనే తానా అతి పెద్ద సంస్థ అని అంటూ అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు తానా చేస్తున్న కృషిని వివరించారు. అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పించేందుకు తానా పాఠశాలను ఏర్పాటు చేశామని, తెలుగు కళల పరిరక్షణకు వీలుగా అమెరికాలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇక్కడి కళాకారులకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తానా చైతన్యస్రవంతి ద్వారా రైతులకు, ఇతరులకు సేవా కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. ఇతర తానా నాయకులు కూడా తమ ప్రసంగాల్లో అమెరికాలో తాము స్థిరపడినా జన్మభూమికి ఏదైనా సేవ చేయాలన్న సంకల్పంతో తానా ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిధులు కూడా తమ ప్రసంగాల్లో తానా తెలుగువారికి చేస్తున్న సేవలను ప్రశంసించారు.

 

Click here for Photogallery

 

 

 

Tags :