Radha Spaces ASBL

డిసెంబర్ 7 నుంచి 24 వరకు మాతృరాష్ట్రాల్లో నాటా 'సేవ'

డిసెంబర్ 7 నుంచి 24 వరకు మాతృరాష్ట్రాల్లో నాటా 'సేవ'

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా)  అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలుగు సంస్కృతీ, సంప్రదాయం, తెలుగు భాషా వైభవానికి కృషి చేస్తోంది. స్థానిక తెలుగు సంఘాలు నిర్వహించే వేడుకల్లో పాల్గొనడంతోపాటు వారికి అవసరమైన సహకారాన్ని కూడా అందిస్తోంది. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకే కాకుండా మాతృరాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి కూడా తమవంతు సాయం అందించేందుకు ప్రతి రెండేళ్ళకోమారు నాటా సేవాడేస్‌ పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా నాటా సేవాడేస్‌ కార్యక్రమాలను డిసెంబర్‌ 7 నుంచి 24 వరకు నిర్వహిస్తోంది.

అమెరికా, కెనడా దేశాల్లో ఉంటున్న తెలుగువారి అభ్యున్నతికి కృషి చేస్తూ, వారి సంక్షేమానికి పాటుపడుతూనే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మాతృరాష్ట్రాలలో కూడా నాటా సేవా డేస్‌ పేరుతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా నాటా సేవా డేస్‌ పేరుతో మాతృరాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు సేవలందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల  తెలిపారు. ఈ సేవా డేస్‌లో ఈసారి అనాథ శరణాలయాలు, ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌, వికలాంగుల వసతి గృహాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని చేయూతను అందించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు రాఘవరెడ్డి గోసల వివరించారు. దాదాపు 18 జిల్లాల్లో, 50కిపైగా ప్రదేశాల్లో నాటా నాయకులు పర్యటించి అక్కడ ఉన్న అనాథ, వికలాంగుల, ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌కు అవసరమైన సహాయాన్ని అందజేస్తారని ఆయన చెప్పారు. దాదాపు 16 రోజులపాటు అమెరికా నుంచి వచ్చిన నాటా నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తారన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న సేవా సంస్థలకు తమ సహాయాన్ని అందిస్తామని, దీంతోపాటు గుంటూరు శంకర నేత్రాలయ వారి సహాయంతో ఉచిత కంటిచికిత్స శిబిరం కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

తిరుపతిలోని ఆశ్రయ వెల్‌ఫేర్‌ ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌, చిత్తూరు జిల్లాలోని సంత పేటలో ఉన్న అనాథ శరణాలయం అమ్మఒడి సేవాశ్రమం, నెల్లూరు జిల్లాలోని ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ అనఘ వృద్ధ విశ్రాంతి ఆశ్రమం, పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న హనుమాన్‌ జంక్షన్‌ వద్ద ఉన్న వికలాంగుల శరణాలయం ఆశాజ్యోతి కేంద్రానికి, ఏలూరులో ఉన్న అనాథ శరణాలయం ఆశ కేంద్రానికి, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉన్న బాపూజీ ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌కు, శ్రీకాకుళంలోని బెహర మనోవికాస కేంద్రానికి, ఒంగోలులోని బొమ్మరిల్లు అనాథ శరణాలయానికి, విశాఖపట్టణంలో ఉన్న అనాథ శరణాలయం కేర్‌ అండ్‌ లవ్‌ సంస్థకు నల్లగొండ జిల్లాలోని పానగల్లులో ఉన్న చారుమతి అనాథ శరణాలయానికి, నెల్లూరు జిల్లా గొల్లపల్లిలో ఉన్న చైల్డ్‌ ఆశ్రమం ట్రస్ట్‌కు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ఎల్లాయపల్లెలో ఉన్న అనాథ శరణాలయం చిన్మయారణ్యం ఆశ్రమంకు, గుంటూరు జిల్లా పొన్నూరులోని అనాథ శరణాలయం డిసిపుల్స్‌ ఆఫ్‌ డివైన్‌ మాస్టర్‌ సొసైటీ, అనంతపురం జిల్లా హిందుపురంలో ఉన్న జిఆర్‌ఎస్‌విహెచ్‌ స్కూల్‌ ఫర్‌ బ్లైండ్‌ కేంద్రానికి, నెల్లూరు జిల్లా కొండయపాలెంలో ఉన్న అనాథ శరణాలయం జనహిత వాత్సల్యకు, అనంతపురం లోని అనాథ శరణాలయం జీవాని వలంటరీ ఆర్గనైజేషన్‌, హైదరాబాద్‌ జిల్లా కొంపల్లిలో ఉన్న అనాథ శరణాలయం ఖుషీ హోమ్‌, విశాఖపట్టణం లోని లెబన్‌షిలైఫ్‌, గుంటూరు జిల్లా తెనాలిలో ఉన్న హోమ్‌ ఫర్‌ లెప్రసీ, రంగారెడ్డి జిల్లా తట్టిఖానాలో ఉన్న ఓల్డ్‌ ఏజ్‌ హోం మాతాపితృల సేవా సదనం, గుంటూరు జిల్లా నూతక్కిలో ఉన్న మాతృఛాయ, కడపలో ఉన్న హలీమా సాదియా అనాథ శరణాలయం, కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉన్న ఓల్డ్‌ ఏజ్‌ హోం నీలం సంజీవ రెడ్డి భవనం, గుంటూరు జిల్లా మైనంపాడులో ఉన్న నైస్‌ స్కూల్‌, అనంతపురం జిల్లాలో ఉన్న ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ కృష్ణారెడ్డి గార్లదిన్నె, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందులలో ఉన్న అనాథ శరణాలయం, అనంతపురం జిల్లా గుంతకల్లులోని అనాథ శరణాలయం గుంతకల్‌కు, తిరుపతిలోని పిఎసి అనాథ శరణాలయం, నెల్లూరులోని ప్రగతి ఛారిటీస్‌ అనాథ శరణాలయం, శ్రీకాకుళం జిల్లాలోని ప్రశాంతి ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌, విశాఖపట్టణం అరకులో ఉన్న ప్రత్యూష హోమ్‌, విశాఖపట్టణంలో ఉన్న ప్రేమ సమాజం, విజయనగరం జిల్లాలో ఉన్న ప్రేమసమాజం, హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న ప్రేరణ స్పెషల్‌ స్కూల్‌కు, కృష్ణాజిల్లాలోని నున్నలో ఉన్న ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ సాయి ఆశ్రమం, కర్నూలు జిల్లా నంద్యాలలోని సంఘమిత్ర అనాథ శరణాలయం,  ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లులో ఉన్న అనాథ శరణాలయం శారద నికేతన్‌, హైదరాబాద్‌లోని కార్ఖానాలో ఉన్న సర్వ్‌ నీడీ అనాథ శరణాలయం, విజయవాడలో ఉన్న  స్పెషల్‌ స్కూల్‌. నల్లగొండ జిల్లా చర్లపల్లిలో ఉన్న స్నేహ అనాథ శరణాలయం, కాకినాడలో ఉన్న స్పెషల్‌ స్కూల్‌, గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఉన్న ఉషోదయ అనాథ శరణాలయం, హైదరాబాద్‌ జిల్లా సైదాబాద్‌కాలనీలో ఉన్న వైదేహి ఫర్‌ గర్ల్స్‌, హైదరాబాద్‌లోని ఓల్డ్‌ బోయినపల్లిలో ఉన్న వాల్మీకి, పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కొండాయపాలెంలో ఉన్న వానప్రస్థ అనాథ శరణాలయం, హైదరాబాద్‌లోని మౌలాలిలోఉన్న వాత్సల్య సింధు ఫర్‌ బాయ్స్‌కు ఈ సేవాడేస్‌లో భాగంగా నాటా సహాయాన్ని అందించనున్నది. మరికొన్ని సేవా కార్యక్రమాలను కూడా నాటా చేస్తోంది. వీధిలైట్ల ఏర్పాటు, ఆరోగ్య శిబిరాలు, స్కూళ్ళలో సౌకర్యాల కల్పనకు సహాయం, సిసి రోడ్లు, విలేజ్‌ డెవలప్‌మెంట్‌తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నాటా నిర్వహిస్తోంది.

ఛారిటీ సంస్థలకు చేయూత

నాటా ఈసారి నిర్వహిస్తున్న సేవాడేస్‌లో ఛారిటీ సంస్థలకు ప్రాధాన్యం?ఇస్తున్నట్లు నాటా ప్రెసిడెంట్‌ రాఘవరెడ్డి గోసల చెప్పారు. ఎన్నో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగులు, మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారికోసం ఏర్పాటైన పలు సంస్థలు తగిన సౌకర్యాలు లేక, ఆర్థిక సహాయం?లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ సిత్థిలో ఇలాంటి సంస్థలకు తగిన చేయూతనివ్వడానికే ఈసారి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన వివరించారు. స్ట్రీట్‌లైట్‌ ఏర్పాటు, కంటి వైద్యశిబిరం, స్కూల్స్‌లో వసతుల ఏర్పాటు,  గ్రామాభివృద్ధికి కూడా సహాయం చేస్తున్నట్లు రాఘవరెడ్డి తెలిపారు. సామాజిక సేవతోపాటు సాంస్కృతిక సేవలను కూడా నాటా చేస్తోందని చెబుతూ, ఈసారి జరిగే నాటా సేవాడేస్‌లో అందరూ పాల్గొనాలని కోరారు. దాదాపు 18 జిల్లాల్లో, 50కిపైగా ప్రదేశాల్లో నాటా నాయకులు పర్యటించి అక్కడ ఉన్న అనాథ, వికలాంగుల, ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌లను సందర్శిస్తారని దీంతోపాటు మరిన్ని కార్యక్రమాల్లో కూడా నాటా నాయకులు పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు.          

 

Tags :