Radha Spaces ASBL

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు పలువురు పీఠాధిపతులు

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు పలువురు పీఠాధిపతులు

ధర్మ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని ఆశీర్వాదం.

ఐదేళ్లలో హిందు దేవాలయ పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సహకరించారని, టీటీడీ, హిందూధర్మ పరిరక్షణ ట్రస్టు ద్వారా భగవంతుడిని భక్తుడి దగ్గరకు చేర్చి బలహీనవర్గాలవారితో కల్యాణోత్సవాలను జరిపించారని గుర్తుచేసిన పీఠాధిపతులు.

ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మత్స్యకార గ్రామాలలో 500 ఆలయాలకు, పాడేరు ఏజెన్సీలో 130 ఆలయాలకు నిధులు విడుదల చేసి ఆలయ జీర్ణోద్ధారణ చేశారని, లక్షలాది భజన, కోలాట బృందాలను, కళాకారులను ప్రోత్సహించి ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్న పీఠాధిపతులు.

నదుల అనుసంధానం, రెండు పుష్కరాల నిర్వహణ చేపట్టి చరితార్ధులయ్యారని సీయం చంద్రబాబును ప్రశంసించిన హిందు ధర్మ పరిరక్షణ ట్రస్టు ప్రతినిధులు, పీఠాధిపతులు.

లక్షమందితో త్వరలో హిందూ ధార్మిక సమ్మేళనాన్ని తలపెట్టామని ముఖ్యమంత్రికి వివరించిన ప్రతినిధి బృందం.

ముఖ్యమంత్రిని కలిసినవారిలో ట్రస్టు చైర్మన్ సీతారామాంజనేయ ప్రసాద్, కార్యదర్శి రాజగోపాల్ చతుర్వేది, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, ప్రభుత్వ ఆలయ వ్యవహారాల సలహాదారు రామకోటయ్య.

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు, పలువురు పీఠాధిపతులు.

ధర్మ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని ఆశీర్వాదం.

 

Tags :