Radha Spaces ASBL

అంగరంగ వైభవంగా జరిగిన బాటా స్వర్ణోత్సవ వేడుకలు

అంగరంగ వైభవంగా జరిగిన బాటా స్వర్ణోత్సవ వేడుకలు

లక్కిరెడ్డి హనిమిరెడ్డికి, జయరామ్‌ కోమటిలకు ప్రత్యేక పురస్కారాల ప్రదానం

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) 50వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత అశ్వనీదత్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అమెరికా తెలుగు కమ్యూనిటీలో ప్రముఖులుగా పేరు పొందిన డాక్టర్‌ లక్కిరెడ్డి హనిమిరెడ్డికి దాతృత్వ సింధు పురస్కారాన్ని అందజేశారు. మరో ప్రముఖులు జయరామ్‌ కోమటిని ప్రవాస బంధు పేరుతో సత్కరించారు. తెలుగు భాషకు, సాహిత్యానికి విశేషంగా కృషి చేస్తున్న రచయిత, రేడియో హోస్ట్‌ కిరణ్‌ ప్రభను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ వేడుకల్లో భాగంగా బాటా కమిటీ నాయకులు, ప్రస్తుత కమిటీ నాయకులతోపాటు, గతంలో కమిటీల్లో పని చేసిన నాయకులు, దాతలు, స్పాన్సర్లకు ప్రత్యేకంగా బాంక్వెట్‌ డిన్నర్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

అక్టోబర్‌ 22వ తేదీన శాంతాక్లారా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ సంగీత కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాంకర్‌, సినీనటి అనసూయ ఉమెన్స్‌ ఫోరం వాళ్ళు ఏర్పాటు చేసిన నారీ కార్యక్రమం ద్వారా ఆకట్టుకుంది. ఫణి నారాయణ వీణా వాద్య కచేరీ, అవధానసామాట్ర్‌ మేడసాని మోహన్‌ సాహిత్య కార్యక్రమం వంటివి ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో హైలైట్‌గా నిలిచాయి. జబర్దస్త్‌ టీమ్‌ కామెడి మరో హైలైట్‌ కార్యక్రమం.

‘శుభారంభం’ ప్రదర్శనతో కార్యక్రమాలను ప్రారంభించారు. వేదమంత్రాలను పఠిస్తుండగా బాటా టీమ్‌ సభ్యులు, మద్దతుదారులు, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై బాటా చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఎస్‌ఎఫ్‌ఓ ఇండియన్‌ కాన్సులేట్‌ కాన్సల్‌ జనరల్‌ డా. టీవి. నాగేంద్ర ప్రసాద్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. మిల్‌పిటాస్‌ మేయర్‌ రిచ్‌ ట్రాన్‌, ఫ్రీమాంట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ రాజ్‌ సల్వాన్‌, అసెంబ్లీ సభ్యుడు ఆష్‌ కల్రా, శాంతాక్లారా కౌంటీ బోర్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుశాన్‌ ఇల్లెన్‌బర్గ్‌, సన్నివేల్‌ మేయర్‌ లిసా గిల్లిమోర్‌, శాంతాక్లారా కౌంటీ సూపర్‌వైజర్‌ ఒట్టో లీ,   శాంతాక్లారా కౌంటీ అసెంబ్లీ మెంబర్‌ అలెక్స్‌ లీ ఆఫీస్‌ ప్రతినిధి, సూపర్‌ వైజర్‌ క్లిందీ చేవేజ్‌, శాంతాక్లారా కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ జెఫ్‌ రోజెన్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని బాటాకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్‌ మెన్‌ ఆర్‌ఓ ఖన్నా, ఎరిక్‌ స్వాల్‌వెల్‌ కూడా అభినందన సందేశాన్ని పంపించారు. 

బే ఏరియాలోని పలు నాట్యకళాశాలలకు చెందిన విద్యార్థులు, వారి గురువులతో కలిసి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి అందరినీ మైమరపింపజేశారు. నాట్యాలయ కూచిపూడికి చెందిన విద్యార్థులు గురువు జ్యోతి లక్కరాజు  ఆధ్వర్యంలో, శివ నూపురం స్కూల్‌ విద్యార్థులు గురువు సింధు సురేంద్ర, సంస్కార్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ విద్యార్థులు గురువు సమిథా సత్యం, నాట్య వేదం కూచిపూడి విద్యార్థులు గురువు శ్రీవిద్యదైత, మాధురి కిషోర్‌ కూచిపూడి స్కూల్‌  విద్యార్థులు గురువు మాధురి కిషోర్‌, నృత్యానంద స్కూల్‌ ఆఫ్‌ కూచిపూడి డ్యాన్స్‌ విద్యార్థులు గురు హిమబిందు చల్లా, కూచిపూడి ఆర్ట్‌ సెంటర్‌ విద్యార్థులు గురువు సునీత పెండేకంటి ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. దీంతోపాటు ప్రదర్శించిన జానపద కోలాహలం, లంబాడి, డప్పు, థింస, గరగలు, బతుకమ్మ, కోలాటం, బోనాలు, మాయామశ్చీంద్ర నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళ్యాణం కమనీయం పేరుతో నిర్వహించిన తెలుగు పెళ్ళి వైభోగం నృత్యరూపకంలో దాదాపు 100 మందికిపైగా చిన్నారులు పాల్గొనడం విశేషం. 

జబర్దస్త్‌ టీమ్‌కు చెందిన ఆటో రామ్‌ప్రసాద్‌, బుల్లెట్‌ భాస్కర్‌, వారి టీమ్‌ చేసిన హాస్య కార్యక్రమాలు అందరినీ కడుపుబ్బ నవ్వించింది. తార్‌ మార్‌ తక్కర్‌ పేరుతో ఎస్‌.ఎస్‌. థమన్‌ నిర్వహించిన కార్యక్రమం కూడా విశేషంగా ఆకట్టుకుంది. పౌరాణిక నాటకానికి ప్రాణం పోసేలా బాటా నాయకులు నిర్వహించిన శ్రీకృష్ణరాయబారం పౌరాణిక నాటిక అహో అనిపించింది. వీణ ది ఎవరెస్ట్‌ పేరుతో ఫణి నారాయణ వీణావాదన మైమరపింపజేసింది. జంతర్‌మంతర్‌ కామెడి స్కీట్‌ నవ్విస్తే, డ్యాన్స్‌లు ఇతర కార్యక్రమాలు వచ్చినవారికి ఉల్లాసాన్ని కలిగించాయి. పాపులర్‌ నటి అనసూయ స్పెషల్‌ గెస్ట్‌గా కనిపించారు. అల అమెరికాపురంలో పేరుతో ఎస్‌.ఎస్‌. థమన్‌, డ్రమ్మర్‌ శివమణితో కలిసి తనదైన శైలిలో చేసిన లైవ్‌ కార్యక్రమం బాటా స్వర్ణోత్సవ వేడుకలకు హైలైట్‌గా కనిపించింది. 

ఈ వేడుకలకు బిజినెస్‌ వర్గాల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. మోక్ష జువ్వెల్లర్స్‌ వారు ప్రోగ్రామ్‌ అసోసియేట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించగా, పవర్‌డ్‌ బై రియల్టర్‌ నాగరాజ్‌ అన్నయ్య, కో పవర్‌డ్‌ గా ఫర్మ్‌ టెక్నాలజీ వారు వ్యవహరించారు. ప్లాటినం స్పాన్సర్‌గా రవి ట్యాక్స్‌ సర్వీసెస్‌, గోల్డ్‌ స్పాన్సర్స్‌గా యూ స్మైల్‌ డెంటల్‌, సత్యదాసరి (రియల్టర్‌), స్వాగత్‌ రెస్టారెంట్‌, ఛానల్‌ రియల్‌ ఎస్టేట్స్‌, రైట్‌ బైట్‌ డెంటల్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, విజేత సూపర్‌ మార్కెట్‌ వ్యవహరించాయి. సిల్వర్‌ స్పాన్సర్స్‌గా శ్రీని గోలి రియల్‌ ఎస్టేట్స్‌, విరిజల్లు రేడియో, సర్వీస్‌ ఓరియెంటెడ్‌ సర్వీసెస్‌, బనియన్‌ వే, అంజనీస్‌ విభా బాటిక్‌, శ్రీ ఫైన్‌ జూవ్వెల్స్‌, అపెక్స్‌ కన్సల్టింగ్‌ వ్యవహరించాయి. 
 బాటా వలంటీర్లు అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, సహకరించిన దాతలకు, ఇతరులకు హరినాథ్‌ చికోటి (ప్రెసిడెంట్‌) అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులైన కొండల్‌ కొమరగిరి (వైస్‌ ప్రెసిడెంట్‌), అరుణ్‌ రెడ్డి, వరుణ్‌ ముక్కా, శివకద, 
స్టీరింగ్‌ కమిటీ సభ్యులైన రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్‌ కుదరవల్లి, సుమంత్‌ పుసులూరి
కల్చరల్‌ డైరెక్టర్స్‌ శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారకదీప్తి, 
నామినేటెడ్‌ కమిటీ సభ్యులు హరి సన్నిధి, సురేష్‌ శివపురం, శరత్‌ పోలవరపు
యూత్‌ కమిటీ సభ్యులు ఉదయ్‌, సంకేత్‌, సందీప్‌, ఆదిత్య, గౌతమి, హరీష్‌, క్రాంతి

బాటా అడ్వయిజరీ బోర్డ్‌ నాయకులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ, కళ్యాణ్‌ కట్టమూరి తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ అభినందలు తెలియజేశారు. 

ఈ వేడుకల్లోనే మరోవైపు కొన్ని కార్యక్రమాలను కూడా బాటా నాయకులు ఏర్పాటు చేసారు. జెపి వేజెండ్ల, కరుణ్‌ వెలిగేటి ఆధ్వర్యంలో ఐటీ ఫోరం తరపున కార్యక్రమాలు జరిగాయి. సీత భరతాల ఆధ్వర్యంలో ఉమెన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో పాపులర్‌ హీరోయిన్‌ అనసూయ స్పెషల్‌ గెస్ట్‌గా కొన్ని కార్యక్రమాలు జరిగాయి.

సాహిత్య కార్యక్రమాలను కూడా డా. కె. గీతామాధవి కన్వీనర్‌గా, కిరణ్‌ ప్రభ హానరరీ అడ్వయిజర్‌గా కార్యక్రమాలను జరిపారు. ‘‘సాహితీ బాట’’ కార్యక్రమాన్ని  ముఖ్య అతిథి, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత వేమూరి వెంకటేశ్వరరావు సాహితీ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్‌ మేడసాని మోహన్‌ అష్టావధానంలో.. పాలడుగు శ్రీచరణ్‌ సంచాలకత్వం వహించారు. చివరగా మృత్యుంజయుడు తాటిపాముల అధ్యక్షతలో జరిగిన కథాచర్చలో మంచి కథ రాయడం ఎలా..? అనే అంశాలపై విస్తృతమైన చర్చ నిర్వహించారు.

మొత్తం మీద బాటా స్వర్ణోత్సవ వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక మీదట కూడా బాటా కమ్యూనిటీకి సేవ చేస్తూనే మరోవైపు సాంస్కృతిక, భాష ఇతర కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తుందని ఈ సందర్భంగా బాటా నాయకులు పలువురు పేర్కొన్నారు. 

 

Click here for Event Gallery

 

 

Tags :