ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కొలంబస్ లో భారతీయ హిందూ టెంపుల్ లో ఘనం గా ప్రారంభం అయిన దుర్గమ్మ పూజలు

కొలంబస్ లో భారతీయ హిందూ టెంపుల్ లో ఘనం గా ప్రారంభం అయిన దుర్గమ్మ పూజలు

ఓహాయో రాష్ట్రం లో కొలంబస్ పట్టణం అమెరికా లో ఈస్ట్ కోస్ట్ వైపు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఇక్కడ తెలుగు వారు కూడా ఎక్కువ గానే వున్నారు. ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఓహయో (APCO) ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన తెలుగు వారితో ప్రారంభం అయిన తెలుగు సంఘం విజయవాడ నుంచి వచ్చిన దుర్గా మల్లేశ్వర దేవస్థానం వారి కనక దుర్గ పూజలు కొలంబస్ లో నిర్వహించే భాధ్యత తీసుకొని, స్థానికంగా వున్న భారతీయ హిందూ టెంపుల్ లో 3 రోజుల దుర్గమ్మ వారి పూజా కార్యక్రమం రూపొందించింది.

APCO సంస్థ ఫౌండర్ శ్రీ నాగేశ్వర రావు మన్నే మాట్లాడుతూ విజయవాడ నుంచి దుర్గమ్మ వారు కొలంబస్ రావటం ఇక్కడి తెలుగు వారి అదృష్టం అని అన్నారు.

APCO అధ్యక్షులు శ్రీ వేణు పసుమర్తి మాట్లాడుతూ భారతీయ హిందూ టెంపుల్ లో ఒక రోజు కుంకుమార్చన, రెండో రోజు శివ పార్వతి కళ్యాణం, మూడో రోజు చండీ హోమం ఏర్పాటు చేశామని, అనేకమంది భక్తులు ఈ కార్యక్రమాలలో వుత్సాహం గా పాల్గొంటున్నారని, చాలా మంది తెలుగువారు ముందుకు వచ్చి భక్తి శ్రద్ద లతో వాలంటీర్ చేస్తున్నారని, అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

దుర్గమ్మ వారి పూజలు అమెరికా లో 10 పట్టణాలలో జరగటాని కి అన్నీ దేవాలయాలతో, తెలుగు వారితో సమన్వయం చేస్తున్న శ్రీ సుబ్బా రావు చెన్నూరి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ రాష్ట్రం లోని దేవాలయాలను, దేవస్తానాలను ఎన్ ఆర్ ఐ లకు మరింత దగ్గరకు చేయటానికి ఇ హుండీ, ఇ డొనేషన్, పరోక్ష సేవ, మా వూరు - మా గుడి లాంటి అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని వివరంగా తెలిపారు.

 

Click here for Event Gallery

 

Tags :