ప్రపంచ ఉద్యమాలకే తలమానికం తెలంగాణ ఉద్యమం - కేసీఆర్

ప్రపంచ ఉద్యమాలకే తలమానికం తెలంగాణ ఉద్యమం - కేసీఆర్

ప్రపంచ ఉద్యమాలకే తెలంగాణ ఉద్యమం కొత్త బాటను చూపిందని టిఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా కీర్తి ఉండిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ప్రజల ఆకాంక్ష, ఆవేశాన్ని మరింత ఉద్యమం వైపు తీసుకెళ్లడం ఎంత సులువైన విషయం కాదన్నారు. దానిని ఒక కార్యాచరణ ప్రణాళికగా మార్చి విజయవంతంగా అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు ప్రజల్లో అనేక అపోహలు అనుమానాలు..సందేహాలు.. విశ్వాస రాహిత్య పరిస్థితి ఉండేదన్నారు. హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసిసిలోన టిఆర్‌ఎస్‌ ద్విదశాబ్ధి ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా ఆయన తొమ్మిదవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ, 2001లో జలదృశ్యంలో పార్టీ జెండా ఆవిష్కరించామని కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసంలో పార్టీ జెండా ఎగిరిందన్నారు. కొద్దిమంది మిత్రులతో కలిసి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టామన్నారు.స్వాతంత్య్ర పోరాటం తరహాలోనే ఉద్యమాన్ని అంచలంచలుగా ముందుకు తీసుకెళ్లామని సిఎం కెసిఆర్‌ పేర్కొన్నారు. రాజీలేని పోరాటమే తెలంగాణ సాధిస్తుందని ఆనాడే కవిత రాశానని కెసిఆర్‌ అన్నారు. అహింసా మార్గంలోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.

20 ఏళ్ల కిందట జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరిందని, ఎన్నో అపనమ్మకాల మధ్య పార్టీ ఏర్పడిరదని సిఎం కెసిఆర్‌ అన్నారు. స్వాతంత్య్రోద్యమంలోనూ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా పోరాటం ఆగలేదన్నారు. ఆ పోరాటంలో నిజాయతీ ఉంది కాబట్టే అంతిమంగా విజయం దక్కిందన్నారు. తెలంగాణకు కూడా అదే పద్ధతి నేర్పించాలని.. దాన్ని కొనసాగించాలని.. ప్రజల్లో విశ్వసనీయత కల్పించాలని స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగామన్నారు. ఈ ఉద్యమానికి సమైక్య పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. వారు వేయని నిందలు లేవు.. పెట్టని తిప్పలు లేవన్నారు. ఎన్ని చేయాలో అన్ని చేశారన్నారు.  తెలంగాణ వస్తే భూముల ధరలన్నీ పడిపోతాయని అన్నారు. ఏడేళ్ల పాలనలో అపోహలన్నీ పటాపంచలు చేశామన్నారు. పంజాబ్‌ను తలదన్నే రీతిలో 3కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిరచామని కెసిఆర్‌ తెలిపారు. పంటల ఉత్పత్తిని చూసి ఎఫ్‌సిఐ తాము కూడా ఇక బియ్యం కొనలేమని చెప్పిందన్నారు. సమైక్యవాదులు ఏఏరంగాల్లో తెలంగాణ వెనుకబడుతుందని దుష్ప్రచారం చేశారో ఆ రంగంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో, తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ జాతీయ స్థాయి కన్నా ముందుందన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో కాపీకొడుతున్నాయన్నారు. మహారాష్ట్రలోని నాంధేడ్ల ప్రజలు తమను తెలంగాణలో కలపమని కోరుతున్నారన్నారు. అలాగే ఇటీవల కర్నాటకలోని రాయచూర్‌ బిజెపి శాసనసభ్యుడు తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ఇక్కడ కూడా అమలు చేయాలని, లేని పక్షంలో తమ ప్రాంతాన్ని ఆ రాష్ట్రంలో కలపాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారని కెసిఆర్‌ అన్నారు. ఏ రంగాల్లో అపోహలు వ్యక్తమయ్యాయో ఆయా రంగాల్లో విజయం సాధించి చూపామన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేస్తున్న గణాంకాలు కూడా రాష్ట్ర అభివృద్ధికి నిదర్శమన్నారు.

తెలంగాణ అభివృద్ధి చెందడం తన ఒక్కడి వల్ల సాధ్య పడలేదని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఇందులో అందరి కృషి ఉందని తెలిపారు. ప్రతిపక్ష శక్తులు అపుడు, ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయని, అన్నింటిని అధిగమించి ముందుకు దూసుకు పోతున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కోర్టుల్లో అనేక అడ్డంకులు సృష్టించారన్నారు. వాటన్నింటిని అధిగమించామన్నారు. రాష్ట్రంలో కులం, మతం అనే ఇరుకైన ఆలోచన తమకు లేదన్నారు. దళిత బంధు ఓ సామాజిక స్వాతన పథకమని వెల్లడిరచారు. ఇది దేశానికి స్ఫూర్తి అని అన్నారు. రైతు బంధు ప్రారంభించినపుడు అనేక అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. ఇప్పుడు కూడా దళిత బంధు పై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. దళిత బంధుకు అయ్యేది లక్షా 70 వేల కోట్ల రూపాయలు%ౌౌ% తెలంగాణ కు ఓ పెద్ద లెక్క కాదన్నారు. ఈ మధ్య ఢల్లీి వెళ్ళినపుడు కొందరు సిఎం లు ఇన్ని డబ్బులు అన్ని పథకాలకు ఎలా తెస్తున్నారని అడిగారన్నారు. దానికి సాహసం కావాలని, తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు సాహాసంతో ముందుకు సాగి విజయం సాధించామని చెప్పారు. దళిత బంధును కూడా నూటికి నూరు పాళ్లు అమలు చేస్తామన్నారు. రాబోయే ఏడేళ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం రూ.23 లక్షల కోట్ల ఖర్చు చేస్తామని తెలిపారు. 2028 బడ్జెట్‌ రూ.4.28 లక్షల కోట్లు కాగా తలసరి ఆదాయం రూ.7.76 లక్షలు చేరుకుందన్నారు.

దళితబంధుతోనే ఆగిపోమని ఎన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. అట్టడుగున ఉన్నందునే దళితులకు మొదట కార్యక్రమం చేపట్టామని తెలిపారు. బలమైన ఆర్థిక శక్తిగా కూడా గులాబీ పార్టీ ఎదిగిందని తెలిపారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోందన్నారు. కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. పాలమూరులో పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామన్నారు. మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సిఎంలు ఆశ్చర్యపోతున్నారన్నారు. ఏదీ ఏమైనా తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఎన్ని అవాంతరాలు ఎదురైనా పథకాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

 

Tags :