Radha Spaces ASBL

ఉత్సాహంగా బాటా వార్షిక కిక్రెట్ టోర్నమెంటు

ఉత్సాహంగా బాటా వార్షిక కిక్రెట్ టోర్నమెంటు

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా జరిగే 6 ఓవర్ల క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఈసారి కూడా ఉత్సాహంగా నిర్వహించింది. కాలిఫోర్నియాలోని ఫెర్మాంట్‌ వేదికగా నిర్వహించిన ఈ టోర్నీలో మహిళలు, పురుషుల విభాగంలో 50కిపైగా జట్లు పాల్గొన్నాయి. ఒక్కో జట్టులో ఆరుగురు చొప్పున 250 మందికిపైగా ప్లేయర్లు ఉత్సాహంగా పాల్గొనడంతో టోర్నీ ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగింది.  ఈనెల 22న జరిగే బాటా 50వ గోల్డెన్‌ జూబిలీ వేడుకలకు కర్టెన్‌ రైజర్‌గా ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఆటగాళ్లంతా బాగా సాధన చేసి రావడంతో చాలా వరకు మ్యాచ్‌లు నువ్వా నేనా? అన్నట్లు సాగి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

ఈ సందర్భంగా బాటా ప్రెసిడెంట్‌ హరినాత్‌ చీకోటి మాట్లాడుతూ.. టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లందరినీ అభినందించారు. ఈ టోర్నమెంట్‌ ఆస్వాదించి ఎలాగైతే విజయవంతం చేశారో.. అలాగే 22న జరిగే బాటా 50వ గోల్డెన్‌ జూబిలీ వేడుకలను కూడా విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. ఈ టోర్నమెంటులో మహిళల విభాగంలో బ్యాటింగ్‌ దివాస్‌ విజతలుగా నిలవగా, రన్నరప్‌లుగా స్ట్రైక్‌ ఫోర్స్‌ జట్టు నిలిచింది. అలాగే సిరీస్‌ ఎంవీపీగా కన్మణి, ఫైనల్‌ మ్యాచ్‌లో ఎంవీపీగా శబరి అవార్డులు అందుకున్నారు. పురుషుల విభాగంలో ‘నవరత్నాస్‌’ జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్‌లుగా ఫాల్సమ్‌ స్టార్స్‌ జట్టు నిలిచింది. ఈ విభాగంలో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, అలాగే మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ రెండు అవార్డులను విజయ్‌ రామ్‌ అందుకున్నారు.

 

Tags :