Radha Spaces ASBL

బాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు 

బాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు 

బే ఏరియా తెలుగు సంఘం (బాటా) ఆధ్వర్యంలో శుభకృతు నామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 3000 మందికి పైగా హాజరయ్యారు. వేడుకలు ఉదయం 10 గంటలకు యూత్‌ టాలెంట్‌ షో (క్లాసికల్‌ మరియు ఫిల్మ్‌, జానపద విభాగాల్లో నృత్యం, గానం)తో ప్రారంభమై, సాంస్కృతిక కార్యక్రమాల శ్రేణితో రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. ఫుడ్‌ ఫెస్టివల్‌ (వివాహ భోజనంబు), దుస్తులు మరియు ఆభరణాల మేళా వేడుకల్లో హైలైట్‌గా నిలిచాయి. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రజలు చాలా కాలం తర్వాత వ్యక్తిగతంగా ఈవెంట్‌లకు హాజరుకావడం ఆనందంగా ఉన్నందున, చుట్టూ పండుగ వాతావరణం నెలకొంది.  ప్రముఖ టాలీవుడ్‌ గాయని మనీషా ఈరాబహ్తిని (బేఏరియా నుండి) సంగీత కచేరీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకలకు వ్యాపార వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ ఈవెంట్‌ను సంజయ్‌ టాక్స్‌ ప్రో సమర్పించారు, పవర్‌డ్‌ బై రియల్టర్‌ నాగరాజ్‌ అన్నయ్యతోపాటు  శ్రీని గోలి (రియల్‌ ఎస్టేట్స్‌) అపెక్స్‌ కన్సల్టింగ్‌, పిఎన్‌జి జ్యువెలర్స్‌, రైట్‌ కేర్‌, సాగర్‌ కోత (రియల్టర్‌) కూడా స్పాన్సర్లుగా వ్యవహరించారు. విరిజల్లు రేడియో, బాలీ 92.3 ఎఫ్‌ఎం మీడియా భాగస్వాములుగా ఉన్నాయి. 

వేదిక అలంకరణలు తెలుగు సంవత్సరాది ఉగాది శోభను తలపింపజేశాయి.  వివిధ రకాల భారతీయ సాంప్రదాయ ఆభరణాలు, దుస్తులు, రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్షియల్‌, ట్యాక్స్‌సర్వీసెస్‌ సేవలవిక్రేతలతో నిండిపోయింది. అతిథులందరికీ ఉగాది పచ్చడి వడ్డించారు. ఈ సంవత్సరం పోటీలకు అద్భుతమైన స్పందన వచ్చింది, 250మందికి  పైగా పిల్లలు శాస్త్రీయ, జానపద/చిత్ర గానం, నృత్యాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలను ఎంచుకోవడానికి న్యాయనిర్ణేతలు చాలా కష్టపడవలసి వచ్చింది. 

ప్రధాన సాంస్కృతిక కార్యక్రమం సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమైంది. నృత్యమానస పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ సెంటర్‌ వారిచే శాస్త్రీయ నృత్య కార్యక్రమంతో ప్రారంభమైంది. తర్వాత 100 మందికి పైగా చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శనలు కుర్రాల్లోయ్‌ కుర్రాళ్లు, జోరుగా హుషారుగా, కేరింత (రెట్రో డ్యాన్స్‌ హిట్‌లు), కవ్వింత, యువతరంగం, నాటు నాటు (బాటా యూత్‌ టీమ్‌ తాజా హిట్‌లకు ఫుట్‌ ట్యాపింగ్‌ డ్యాన్స్‌లు)తో కార్యక్రమాలు అదిరిపోయాయి.

జాతి రత్నాలు హాస్యనాటిక ఎంతో నవ్వించింది. కోవిడ్‌ సమయంలో కుటుంబాలు వివిధ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాయో ఉల్లాసంగా తెలియజేసింది. 

బాటాకు ఇది 50వ మైల్‌స్టోన్‌ సంవత్సరం. ఈ వేడుకను పురస్కరించుకుని ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు మరియు ఆడియో వీడియో క్లిప్‌ను డాక్టర్‌  నాగేంద్ర ప్రసాద్‌ (కాన్సల్‌ జనరల్‌, ఇండియన్‌ కాన్సులేట్‌) ఆవిష్కరించారు. బాటా బృందం 2022 వేసవిలో ఒక గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోంది. 

ఫ్రీమాంట్‌ సిటీ మేయర్‌ లిల్లీ మెయి, మిల్పిటాస్‌ మేయర్‌ రిచ్‌ ట్రాన్‌, మిల్పిటాస్‌ పోలీస్‌ కెప్టెన్‌ ఫ్రాంక్‌ మోరేల్స్‌, అసెంబ్లీ సభ్యుడు అలెక్స్‌ లీ, శాంటా క్లారా సూపర్‌వైజర్‌ సిండి చావెజ్‌ తదితర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. 

అమెరికాలోని తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న తానా, బాటా పాఠశాల విద్యార్థులు ఈ వేడుకల్లో నాటికను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. తానా కార్యదర్శి సతీష్‌ వేమూరి,  తానా ప్రాంతీయ ప్రతినిధి రామ్‌ తోట  ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

చివరగా అందరూ ఎదురుచూసిన సింగర్‌ మనీషా లైవ్‌ సంగీత కచేరీ జరిగింది. మనీషా మాట్లాడుతూ, బాటా వేడుకల్లో ప్రదర్శన ఇవ్వడం చాలా థ్రిల్‌గా ఉందని, చిన్నప్పుడు కలిగిన మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఆమె పాత హిట్‌లు (60/70లు) మరియు తాజా చార్ట్‌ బస్టర్‌ హిట్‌లతో లైవ్‌ సంగీత కచేరీని అందరినీ మైమరపింపజేసేలా పాడిరది.

బాటా ప్రెసిడెంట్‌ హరినాథ్‌ చికోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు మరియు పాల్గొన్నవారికి ధన్యవాదాలు తెలిపారు. కష్టపడి పనిచేసిన వాలంటీర్లందరినీ ఆయన అభినందించారు, బాటా బృందానికి ధన్యవాదాలు తెలిపారు. స్పాన్సర్లను కూడా వేదికపై ఆహ్వానించి బాటాకు వారు ఇస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలియజేసింది.

బాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ:

హరినాథ్‌ చికోటి (అధ్యక్షుడు), కొండల్‌ రావు కొమరగిరి (వైస్‌ ప్రెసిడెంట్‌), అరుణ్‌ జంగా, వరుణ్‌ ముక్క, శివ కదా
స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీదుల, కామేష్‌ మల్ల, యశ్వంత్‌ కుదరవల్లి, సుమంత్‌ పుసులూరి  
కల్చరల్‌ డైరెక్టర్స్‌ శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, శిరీషా బత్తుల
నామినేటెడ్‌ కమిటీ సభ్యులు హరి సన్నిధి, సురేష్‌ శివపురం, శరత్‌ పోలవరపు, సంకేత్‌ కసుప, సందీప్‌ రెడ్డి
యూత్‌ కమిటీ - ఆదిత్య నెరుసుల, గౌతమి బొజ్జ, ఉదయ్‌ గోవిందరాజులు, హరీష్‌ బుడ్డిగ, క్రాంతి కిరణ్‌.

బాటా అడ్వయిజరీ టీమ్‌ జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండా, కళ్యాణ్‌ కట్టమూరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బాటా బృందాన్ని అభినందించారు.

 

Click here for Event Gallery

 

 

Tags :