ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బే ఏరియా తెలుగు అసోసియేషన్ 50 ఏళ్ళ ప్రస్థానం

బే ఏరియా తెలుగు అసోసియేషన్ 50 ఏళ్ళ ప్రస్థానం

* బాటా అంటే బే ఏరియా తెలుగు అసోసియేషన్‌. అమెరికాలో వెలసిన మొట్టమొదటి తెలుగు సంఘం బాటా అని చెప్పాలి. 50, 60లలో ఒకళ్ళు, ఇద్దరుగా తెలుగు వారు అమెరికా రావడం మొదలు పెట్టారు. కొందరు అయితే షిప్‌లో 35 రోజులు  ప్రయాణం చేసి అమెరికా వచ్చామని చెప్పడం కూడా విన్నాం. అలాంటి వారు కొందరు కలిసి ప్రారంభించిన మొదటి తెలుగు సంఘమే ‘బాటా’. బాటా మొదటి రోజులలోనే భాషకు, సాంస్కృతిక కళా కార్యక్రమాలకు. వినోద కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇచ్చేది. అలనాటి నాటి మేటి గాయకులు ఘంటసాల వేంకటేశ్వరరావుగారిని అమెరికాలో పిలిపించి, కచేరి చేయిం చింది బాటా. అనాటి నుంచి ఈనాటి దాకా  బాటా దాదాపు 5000కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహించింది.

* బాటా అంటే ఎస్‌పీ బాలసుబ్రమణ్యం గారికి ఎంతో ఇష్టం. ఆయనతో 20కి పైగా ప్రత్యేక సంగీత కార్యక్రమాలు చేసింది బాటా. అంతే కాకుండా పద్మవిభూషణ్‌ ఎస్‌పీ బాల సుబ్రమణ్యం గారి ఎస్‌పీబీ 50 అనే కార్యక్రమం వైభవంగా నిర్వహించింది. అదే విధంగా నాట్యంలో కీర్తి ప్రతిష్టలు అందుకొన్న పద్మభూషణ్‌ వెంపటి చినసత్యంగారి 75వ పుట్టిన రోజు వేడుకల కార్యక్రమంను కూడా వైభవంగా నిర్వహించింది. పద్మభూషణ్‌ మంగళంపల్లి బాలమురళికృష్ణ గాన కచేరి నిర్వహించి శాస్త్రీయ సంగీతాభిమానులను అలరించింది.

* ప్రతి సంవత్సరం జులై నెలలో జరిగే ఆటా, తానా మహాసభలు అంటే తెలియని తెలుగువారు ఉండరు. అలాంటి 10కి పైగా ఆటా, తానా తెలుగు మహాసభల నిర్వహణలో బాటా పాలు పంచుకుంది.

* అమెరికాలో తెలుగువారికి వినోదం అంటే మ్యూజికల్‌ ప్రొగ్రామ్‌, బాటా తెలుగు వారి కోసం దాదాపు 100కి పైగా మ్యూజికల్‌ పోగ్రామ్‌లు నిర్వహించి అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళుతోంది.

* సాహిత్య, సొంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో పేరు తెచ్చుకుందో, సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించి అంతే గుర్తింపు తెచ్చుకొంది. శంకర ఐ ఫౌండేషన్‌ వారి కోసం దాదాపుగా 5 మిలియన్‌ డాలర్లకు పైగా విరాళాలు సేకరించి ఇండియాలో కంటి ఆసుపత్రుల నిర్మాణంలో కీలక పాత్ర వహించింది.

* కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఇండియాలో వైద్య సదుపాయాలు లేని చోట వైద్య సదుపాయాలు కలిగించే ప్రాజెక్టులో బాటా భాగస్వామిగా ఉండి 10 ఐసియు బెడ్‌ ఆసుపత్రుల నిర్మాణంలో పాల్గొంది. తెలుగు వారి గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం, ఈటీవీ వారి పాడుతాతీయగా కార్యక్రమంను బే ఏరియాలో  నిర్వహించింది.

* తెలుగు చిన్నారులకు తెలుగు నేర్పించాలి అన్న ఉద్దేశంతో ‘పాఠశాల’ని స్థాపించి, నిర్వహించడంలో భాగస్వామ్యం తీసుకొని, ఇప్పటివరకు 500కి పైగా చిన్నారులకు ప్రాథమిక తెలుగు నేర్పించడంలో విజయవంతం అయింది. తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రమైన అన్నమయ్య  కీర్తనలను పద్మశ్రీ శోభరాజుతో దాదాపు 100కి పైగా నిర్వహించి, చిన్నారులకు అన్నమయ్య కీర్తనలు నేర్పించడంలో విజయం సాధించింది.

* అమెరికాలో ఉన్న వారి కోసం, అమెరికా కమ్యూనిటీ కోసం, లేదా తెలుగు రాష్ట్రాలలో అనేక సంఘాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఆ సేవా కార్యక్రమాల కోసం విరాళాల సేకరణ కూడా చేస్తూ ఉంటాయి. బాటా అమెరికాలో, బే ఏరియాలో ఉన్న ఇతర సేవా సంస్థలతో కలిసి దాదాపుగా 200కి పైగా విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించి ఆ సేవా సంస్థలు చేసే మంచి పనులలో భాగస్వామి అయింది.

* కమ్యూనిటలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా, ఆపద వచ్చినా ఆదుకోవడం, సాయం చేయడం, కొందరు చేస్తూ ఉంటారు. బే ఏరియాలో కమ్యూనిటీకోసం 300కి పైగా విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించి, అవసరానికి సరిపడా సేకరించి, ఆ సాయం చేరవలసిన వారికి చేర్పించింది బాటా.

* కమ్యూనిటీ కార్యక్రమాలు చేయడంతో పాటు యువతకి ప్రాధాన్యం ఇచ్చి యువతను ప్రోత్సహించి, వారు కార్యక్రమంతో పాల్గొనేటందుకు వీలుగా  దాదాపు 200కి పైగా యూత్‌ టాలెంట్‌ షోలు నిర్వహించింది.

* ఇద్దరు ముఖ్యమంత్రులు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబుల సభలను బే ఏరియాలో విజయవంతంగా నిర్వహించింది. అనేక సేవా కార్యక్రమాలు హెల్త్‌ క్యాంపులు, ఫుడ్‌డ్రైవ్‌లు బాటా చేసింది. 1000 మందికి పైగా వలంటీర్లు, లక్షలాది మందికిపై అభిమానులు బాటాకి ఉన్నారు.

* తెలుగు కమ్యూనిటీకి ఇష్టమైన మరో అంశం క్రీడలు. ఆటా బాటా ఇప్పటి వరకు దాదాపుగా 50కి పైగా క్రీడా కార్యక్రమాలు నిర్వహించింది.

* తెలుగు వారికి నచ్చే, మెచ్చే అంశం సాహిత్యం. బాటా దాదాపు 50కి పైగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహంచి సాహిత్యాభిమానుల మన్నన కూడా పొందింది.

* అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉంటున్న తెలుగు కమ్యూనిటీకి రాష్ట్రాల నుంచి ఎవరైనా పెద్ద వాళ్ళు వచ్చారంటే  సంతోషం. కలవాలనే ఉత్సాహం ఉంటుంది. బాటా దాదాపుగా 200కి పైగా మీట్‌ అండ్‌ గ్రీట్‌ వంటి కార్యక్రమాలు, తెలుగురాష్ట్రాల నుంచి వచ్చిన రాజకీయనాయకులు, సినిమా ప్రముఖుల కోసం ఏర్పాటు చేసి నిర్వహించింది.

* తెలుగువారికి ప్రాచీన,  సాంప్రదాయ కళలు అన్న కూడా ఇష్టమే. అందుకే బాటా సాంప్రదాయ ప్రాచీన కళలైన హరికథ, బుర్రకథ లాంటి కార్యక్రమాలను 100కి పైగా నిర్వహించింది.

* ప్రముఖులచే సంగీత కచేరీ చేయించడం ఎంత ముఖ్యమో, తెలుగు కమ్యూనిటీలో ఉన్న ఔత్సాహక సంగీత గాయకులను గుర్తించడం ప్రోత్సహించడం, అవకాశాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం., అందుకనే బాటా బేఏరియాలలో ఉన్న సంగీత ప్రియులు, గాయని, గాయకులు కోసం 100కి పైగా కరవోకె కార్యక్రమాలు నిర్వహించింది.

 

Tags :