Radha Spaces ASBL

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం ప్రారంభించిన సీఎం

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం ప్రారంభించిన సీఎం

పేదవర్గాలకు మేలు చేస్తూ నవరత్నాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆయన ప్రారంభించారు. దీని ద్వారా మగ్గం ఉన్న చేనేతల కుటుంబానికి ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చేనేతలు పేదరికం, అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఆప్కో వ్యవస్థను ప్రక్షాలను చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జనవరి 9న అమ్మ ఒడి పథకాన్ని తీసుకొస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, లక్షా 30 వేల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా జరగాలన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అందరికీ న్యాయం చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం సృష్టం చేశారు.

 

 

Tags :