ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏపీలో దూసుకెళ్తున్న వైకాపా

ఏపీలో దూసుకెళ్తున్న వైకాపా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైకాపా దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార టీడీపీ చతికిలపడింది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం వైకాపా 142 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా టీడీపీ ఆధిక్యం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. రాష్ట్రంలో వైకాపా హవా కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను పలువురు నేతలు కలిసి అభినందనలు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వచ్చి ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన్ని కౌగిలించుకొని అభినందనలు తెలిపారు. తన నివాసం నుంచి ఎన్నికల ఫలితాలను టీవీలో వీక్షిస్తున్న జగన్‌తో పాటు పలువురు  పార్టీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్‌ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. అటు లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 23 స్థానాల్లో ఫ్యాన్‌ హవా కొనసాగుతుండగా టీడీపీ రెండు స్థానాల్లో ముందంజలో ఉంది.

 

Tags :