ఆ మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు ఓట్లేయొద్దు

లోక్‌సభ ఎన్నికల్లో తమ వర్గానికి బీజేపీ టికెట్లు ఇవ్వకపోవడంపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాజ్‌పుత్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముజఫర్‌నగర్, కైరానా, సహారన్‌పుర్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను బహిష్కరించాలని ఖేడా ప్రాంతంలో నిర్వహించిన మహాపంచాయత్‌లో నిర్ణయించారు. కిసాన్ మజ్దూర్ సంగఠన్ జాతీయాధ్యక్షుడు ఠాకుర్ పూరణ్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సభకు వివిధ జిల్లాల నుంచి రాజ్‌పుత్‌లు హాజరయ్యారు. ఎన్నికల్లో బీజేపీకి బదులు ఇతర పార్టీల్లోని బలమైన అభ్యర్థులకు ఓటేయాలని నిర్ణయించినట్లు పూరణ్ సిగ్ తెలిపారు. యూపీలో ఈ నెల 19న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.