యూట్యూబ్‌లో సుమ నటించిన 'గీతాంజలి'

యూట్యూబ్‌లో సుమ నటించిన 'గీతాంజలి'

10-04-2017

యూట్యూబ్‌లో సుమ నటించిన 'గీతాంజలి'

అమెరికాలో 1996లో నిర్మించిన 'గీతాంజలి' తెలుగు సీరియల్‌ ఇప్పుడు ఐ డ్రీమ్‌ మీడియా ద్వారా యూ ట్యూబ్‌ లో ప్రసారమవుతోందని ఆ సీరియల్‌ నిర్మాత, తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ సీరియల్‌కు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ దామరాజు కుమార్‌.

ప్రస్తుతం బిజీయాంకర్‌గా పేరు తెచ్చుకున్న సుమ నటించిన తొలి సీరియల్‌ ఇది. 1996లో అమెరికాలోనే షూటింగ్‌ జరుపుకున్న తెలుగు సీరియల్‌ అన్న గుర్తింపును పొందిన ఈ సీరియల్‌ అప్పుట్లో అందరినీ ఎంతో అలరించింది. ఈ సీరియల్‌లో నటించినవారంతా న్యూజెర్సి ప్రాంతంలోనివారే కావడం విశేషం. 20 ఏళ్ళ తరువాత కూడా గీతాంజలి ఇప్పటి పరిస్థితులకు కూడా సరిపోతుందని, నేటి తరానికి కూడా ఈ సీరియల్‌ గురించి తెలియజేయాలన్న ఆలోచనతో ఐ డ్రీమ్‌ మీడియా ద్వారా యూ ట్యూబ్‌లో ఏప్రిల్‌ 6 నుంచి ప్రసారం చేస్తున్నాము. ప్రతి గురువారం ఇది ప్రసారమవుతుంది. 13వారాల పాటు ఈ సీరియల్‌ను మీరు చూడవచ్చు.