పెట్టుబడుల సదస్సుకు సీఎంను రమ్మని పిలిచిన జెట్రో

పెట్టుబడుల సదస్సుకు సీఎంను రమ్మని పిలిచిన జెట్రో

19-04-2017

పెట్టుబడుల సదస్సుకు సీఎంను రమ్మని పిలిచిన జెట్రో

ఏపీలో పెట్టుబడులు పెడుతున్న జపనీస్ కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతోందని జెట్రో చైర్మన్ హిరోయుకి ఇషిగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చెప్పారు. ఏపీలోకార్యకలాపాల పురోగతిని వివరించిన జెట్రో చైర్మన్కు పేదరికాన్ని రూపుమాపడానికి సాంకేతికతను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నది ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రానికి వున్నసానుకూలతల దృష్ట్యా జపాన్ నుంచి మరింతగా పెట్టుబడుల సంఖ్య పెరగాల్సి వుందని ముఖ్యమంత్రి అన్నారు. జపాన్లో త్వరలో మరో పెట్టుబడుల అవగాహనా సదస్సు ఏర్పాటుచేస్తున్నామని, ఈ సెమినార్లో పాల్గొనాలని ముఖ్యమంత్రిని జెట్రో చైర్మన్ ఆహ్వానించారు.